డైరెక్టర్ శంకర్‌తో సీఎం విజయ్ తనయుడు.. ఏంటి విషయం
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:51 AM
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జాసన్ సంజయ్, ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. శంకర్ ఒక ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తమిళ సినీ పరిశ్రమలో వరుస ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జాసన్ సంజయ్ (Jason Sanjay), ఇండియన్ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. శంకర్ (Director Shankar) ఒక ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకేచోట ఈ ఇద్దరూ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి రావడంతో, అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ గురించిన చర్చలు మొదలుపెట్టారు.
వీరిద్దరూ ఎందుకు కలుసుకున్నారనేది క్లారిటీ లేదు కానీ, వీరి మీట్‌లో శంకర్ ఎంతో ఆప్యాయంగా జాసన్ సంజయ్‌ను కౌగిలించుకుని, ఆయనను ఆత్మీయంగా పలకరించడం కనిపించింది. జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టుల గురించి, ఆయన ప్రతిభ గురించి శంకర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. జాసన్ విజన్, పనితీరును అభినందిస్తూ శంకర్ చెప్పిన మాటలకు జాసన్ కూడా ఎంతో వినయంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఇద్దరి మధ్య సాగిన సంభాషణ అక్కడ ఉన్న కెమెరాలు బంధించాయి.
కాగా, జాసన్ సంజయ్ ఇప్పటికే విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు పూర్తి చేసి దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సిగ్మా’ (Sigma) అనే భారీ చిత్రంతో ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ స్వయంగా జాసన్‌ను కలుసుకొని ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ లేదా కొలాబరేషన్ ఉంటుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Mega158: ‘మెగా158’లో మురళీ శర్మ లుక్ చూశారా..
మెగా ట్రీట్.. ‘వారణాసి’లో రాముడిగా మహేష్.. హనుమంతుడిగా ఎవరంటే
ఫ్యాన్స్ ప్రెషర్‌ని తట్టుకోవడం ఈ దర్శకధీరుడికే సాధ్యమైంది..