సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ముంబైలో అట్లీ రూ. 38 కోట్ల లగ్జరీ ఇల్లు..

ABN, Publish Date - Jul 29 , 2026 | 07:57 PM

జవాన్ చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee) బ్రాండ్ వ్యాల్యూ రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతోంది.

Director Atlee

జవాన్ చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించిన కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee) బ్రాండ్ వ్యాల్యూ రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా ఆయన ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో రూ.38 కోట్ల విలువైన సీ-ఫేసింగ్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అత్యాధునిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన సముద్ర వీక్షణతో కూడిన ఈ కొత్త ఇల్లు గురించిన న్యూస్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


అయితే ఈ విలాసవంతమైన ఇల్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై ఆఫీస్‌కి అత్యంత సమీపంలో ఉండటం విశేషం. ప్రస్తుతం అట్లీ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రాకా శరవేగంగా పట్టాలెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రణాళికలు, స్క్రిప్ట్ వర్క్స్, షూటింగ్ డిస్కషన్స్ కోసం ఇద్దరి కార్యాలయాలు, నివాసాలు దగ్గరగా ఉండటం ఈ ప్రాజెక్ట్‌కి ఎంతో కలసివస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీ మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బన్నీ మొదటి సారి ద్విపాత్రభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాకాను రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.


తమిళంలో వరుస హిట్లు కొట్టి, హిందీలో జవాన్ తో హిస్టరీ క్రియేట్ చేసిన అట్లీ.. ఇప్పుడు ముంబైలోనే స్థిరపడుతూ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తున్నాడు. రాకా తరువాత బాలీవుడ్ లో పలు ప్రాజెక్టులు చేయడానికి అట్లీ సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అట్లీ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ అటు తమిళ్ ఇండస్ట్రీని, ఇటు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మరి రాకాతో అట్లీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో తెలియాలి.

Updated Date - Jul 29 , 2026 | 08:00 PM