సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనుపమతో బ్రేకప్.. ఎట్టకేలకు నోరువిప్పిన ధృవ్ విక్రమ్

ABN, Publish Date - Aug 17 , 2026 | 08:45 PM

తమిళ వర్సటైల్ యాక్టర్ నటుడు విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ పేరు ఈమధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెల్సిందే. అందాల భామ అనుపమ పరమేశ్వరన్- ధృవ్ ప్రేమాయణం ఎంత ఫేమస్ అయ్యిందో .. వారి బ్రేకప్ మరింత ఫేమస్ అయ్యింది.

Dhruv Vikram

తమిళ వర్సటైల్ యాక్టర్ నటుడు విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) పేరు ఈమధ్య సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన విషయం తెల్సిందే. అందాల భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)- ధృవ్ ప్రేమాయణం ఎంత ఫేమస్ అయ్యిందో .. వారి బ్రేకప్ మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా అనుపమ.. ధృవ్ పెద్ద టాక్సిక్ అబ్బాయి అని.. రెండేళ్ళు నరకం చూపించాడు అని చెప్పుకొచ్చింది. దీంతో కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య జరిగిన ప్రతి విషయం గురించి చర్చ మొదలయ్యింది. ఇంత జరిగినా కూడా ధృవ్ ఈ బ్రేకప్ పై నోరు మెదపలేదు. తాజాగా తన వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై తాజాగా స్పందించాడు. ఇండస్ట్రీలో ఒక నటుడిగా కొనసాగుతున్నప్పుడు వ్యక్తిగత విషయాలపై పరిశీలనలు, విమర్శలు సహజమేనని, అయితే అలాంటి వ్యాఖ్యలు తనను ప్రభావితం చేయలేదని చెప్పలేనని అతను బహిరంగంగా అంగీకరించాడు.


ఈ సందర్భంగా ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ.. "నేను చాలా చిన్న వయసులోనే ఈ సినీ పరిశ్రమను నా వృత్తిగా ఎంచుకున్నప్పుడు, ఇక్కడ మన వ్యక్తిగత విషయాలపై తీవ్రమైన విమర్శలు, పరిశీలనలు ఉంటాయని నాకు ముందే అర్థమైంది. ఇవి నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. కానీ మనం ప్రేమించే వ్యక్తులను ఎల్లప్పుడూ బలంగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం నిజాయితీగా, సత్యం వైపు నిలబడినప్పుడు, మనల్ని నడిపించే సూత్రాలు స్పష్టంగా ఉన్నప్పుడు, ఇలాంటి విమర్శలన్నీ కాలక్రమేణా మాయమవుతాయి'అని ఎమోషనల్ వ్యాఖ్యలు చేశాడు.


తన ప్రయాణంలో ఎదురైన ఒడుదొడుకుల్లో అభిమానులు,మద్దతుదారులు అందించిన ప్రోత్సాహమే తనను ముందుకు నడిపిస్తోందని ధృవ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇన్ని మాటలు కూడా కేవలం తనను తాను కప్పిపుచ్చుకోవడానికే అని, అనుపమ రెండేళ్ళు నరకం అనుభవించిందన్న డానికి చాలానే సాక్ష్యాలు ఉన్నాయని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఒక ఈవెంట్ లో అనుపమ ఏదో మాట్లాడితే.. నీ పని నువ్వు చూసుకో అని ధృవ్ అనడం.. నిఖిల్ తో నాటకాలు పాడ్ క్యాస్ట్ లో అనుపమను కంటిచూపుతోనే భయపెట్టడాలు.. ఇలా ఎన్నో వీడియోలను నెటిజన్స్ వెలికితీస్తున్నారు. అంతా చేసి ఇప్పుడు అనుపమ బయటపడేసరికి ఇలా మాట్లాడడం కేవలం కవర్ చేసుకోవడానికే అని చెప్పుకొస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ తరువాత ధృవ్ పై చాలా నెగిటివిటీ ఏర్పడింది. ఆ నెగిటివిటీని తగ్గించుకోవడానికే ధృవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అంటున్నారు. మరి ఈ బ్రేకప్ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Updated Date - Aug 17 , 2026 | 09:03 PM