ఫైర్ బ్రాండ్ రోజా రీఎంట్రీ.. పులి మేక ట్రైలర్ చూశారా

ABN , Publish Date - May 30 , 2026 | 03:00 PM

సీనియర్ నటి, ఫైర్ బ్రాండ్ రోజా సెల్వమణి (Roja Selvamani) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రోజా..

Puli Mekka

సీనియర్ నటి, ఫైర్ బ్రాండ్ రోజా సెల్వమణి (Roja Selvamani) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రోజా.. రాజకీయాల్లోకి వచ్చాకా సినిమాలు తగ్గించారు. ఇక తాజాగా రోజా తమిళ్ సినిమాలో రీఎంట్రీ ఇచ్చారు. దాదాపు 12 ఏళ్ళ తరువాత ఆమె నటిస్తోన్న చిత్రం లెనిన్ పాండియన్. ఈ సినిమా తెలుగులో పులి మేక (Puli Mekka) అనే పేరుతో రిలీజ్ కానుంది. డి.డి. బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంలో గంగై అమరన్, దర్శన్ గణేశన్ కీలక పాత్రల్లో నటించారు.


ఇప్పటికే పులి మేక చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యం, రాజకీయాలు, మరియు పోలీసు వ్యవస్థ చుట్టూ తిరిగే ఒక పవర్‌ఫుల్ సామాజిక డ్రామాగా రూపొందింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఒక సామాన్య రైతు స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాడనే బలమైన సంభాషణతో ఈ ట్రైలర్ మొదలయ్యింది. ఇంకోపక్క కానిస్టేబుల్ గా హీరో ఎన్ని అవమానాలు పడుతున్నాడో చూపించారు.


పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లపై జరిగే అణిచివేత, ఉన్నతాధికారుల అహంకారం, మరియు మట్టి మాఫియా వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. చట్టం, న్యాయం, మరియు అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరిగే పోరాటమే ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రోజా ఒక వయస్సు మళ్ళిన మహిళగా కనిపించారు. ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే ఇళయరాజా మ్యూజిక్ మరో ఎత్తు. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రంతో రోజా రీఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.

Updated Date - May 30 , 2026 | 03:15 PM