ధనుష్ కారులో మృణాల్.. అడ్డంగా దొరికిపోయిందిగా
ABN, Publish Date - Nov 02 , 2026 | 07:00 PM
ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సాధారణమే. ముఖ్యంగా హీరోయిన్స్.. ఒక హీరోతో కనిపించారు అంటే వారిద్దరి మధ్య ప్రేమ పెళ్లి అని రకరకాల పుకార్లు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి.
ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి సాధారణమే. ముఖ్యంగా హీరోయిన్స్.. ఒక హీరోతో కనిపించారు అంటే వారిద్దరి మధ్య ప్రేమ పెళ్లి అని రకరకాల పుకార్లు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి. అయితే ఇంకోపక్క నిప్పు లేనిదే పొగరాదు అనే సామెతలా హీరో- హీరోయిన్ మధ్య ఏది లేకపోతే అసలు రూమర్ అనేది ఎందుకు వస్తుంది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. అందాల భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. ఈసారి అడ్డంగా దొరికిపోయింది. గత కొంతకాలంగా మృణాల్.. తమిళ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తో రిలేషన్ లో ఉందని గట్టి ప్రచారం జరుగుతోన్న విషయం తెల్సిందే.
ఎలాంటి సంబంధం లేని ధనుష్.. మృణాల్ సినిమా ఈవెంట్ లో కనిపించి హైలైట్ గా నిలిచాడు. ఆ తరువాత మృణాల్ తమిళ్ సాంగ్స్ పాడడం, ధనుష్ సిస్టర్ ని ఫాలో అవ్వడం, వారి ఇండికి వెళ్ళడం ఇవన్నీ వీరిద్దరి మధ్య ఏదో ఉందని రుజువు చేశాయి. ఇక అంతా బావుంది అనుకొనేలోపు.. మృణాల్ ఇలాంటి పబ్లిసిటీతో నాకు బాగా పేరు వచ్చింది.. ధనుష్ నాకు అన్నయ్యలాంటి వాడని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో కొన్ని రోజులు ఈ రూమర్స్ కి చెక్ పడినట్లు అయ్యింది. నిజంగానే మృణాల్ - ధనుష్ కి మధ్య ఏం లేదేమో అని నెటిజన్స్ కూడా సైలెంట్ అయ్యారు.
అయితే తాజాగా మృణాల్ .. మరోసారి ధనుష్ తో కనిపించి ఈ రూమర్స్ కి మరింత ఆజ్యం పోసింది. ఐశ్వర్య రజినీకాంత్‌తో విడాకుల తర్వాత ధనుష్ ఎక్కువగా ముంబైలోనే గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ జంట ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి షాక్ ఇచ్చారు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే పాపరాజీలు ఆయనను ఫోటోలు తీయగా, ధనుష్ కూడా ఎంతో ఓపిగ్గా కెమెరాలకు ఫోజులిచ్చాడు. ఇక ధనుష్ కారు ఎక్కుతుండగా, ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఒక మహిళ కెమెరాల వైపు చూడకుండా తన రెండు చేతులతో ముఖాన్ని దాచుకోవడం వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపించింది. పాపరాజీలు ఆమెపై కెమెరా జూమ్ చేయడంతో ఆమె ఫోటోలకు చిక్కకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆమె బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ చూసి నటి మృణాళ్ ఠాకూర్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ధనుష్ కారులో మృణాళ్ ఠాకూరేనని ఫ్యాన్స్ గట్టిగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.