ఓం ట్రైలర్.. అదిరిపోయింది
ABN, Publish Date - Nov 14 , 2026 | 03:56 PM
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్న టాలెంటెడ్ హీరో ధనుష్ (Dhanush) నటించిన తాజా చిత్రం ఓం (O.M). రాజ్‌కుమార్ పెరిసామి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, వండర్‌బార్ ఫిలింస్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాయి.
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్న టాలెంటెడ్ హీరో ధనుష్ (Dhanush) నటించిన తాజా చిత్రం ఓం (O.M). రాజ్‌కుమార్ పెరిసామి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, వండర్‌బార్ ఫిలింస్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాయి. ఇక ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mamooty), సాయిపల్లవి, శ్రీలీల, రేణు దేశాయ్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఓం సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఈ ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ఎర్రచందనం స్మగ్లింగ్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ నేపథ్యంలో ఈ కథ సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. 'ఇది ఎలాంటి నేరం అంటే.. నేచర్‌పై జరిగే క్రైమ్..' అనే డైలాగ్ తో మొదలయిన ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలను నింపేశారు. ధనుష్.. ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ ఆఫీసర్ గా కనిపించగా.. సాయిపల్లవి నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. 'నేను ఈ ఆపరేషన్‌ను రన్ చేస్తున్నాను.. దీని పేరు ఆపరేషన్ మోల్.. అంటే ఓం అని చెప్పే సన్నివేశాలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. మరోవైపు ధనుష్, మమ్ముట్టి స్క్రీన్ ప్రెజెన్స్, వారి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఇక ఈ సినిమా ఆంధ్రాతెలంగాణ బోర్డర్ మధ్యలో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక స్మగ్లర్ కి, పోలీసులకు మధ్య సాగే ఒక యుద్దంలా కనిపిస్తుంది. ఇక పోలీస్ అయిన హీరో.. గ్యాంగ్ స్టర్ గ్యాంగ్ లో చేరి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీసులకు అందజేస్తున్నట్లు కనిపిస్తోంది. మొదట ఈ చిత్రానికి ఓం అనే టైటిల్ పెట్టారు. కానీ, సడెన్ గా ఓం మధ్యలో డాట్ ని చేర్చారు. దీనివలన ఈ సినిమా కచ్చితంగా వివాదాలను ఎదుర్కొనుందన్న విషయం తెలుస్తోంది. మొత్తానికి ఓం ట్రైలర్ తో హైప్ పెంచేశారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.