అనిరుధ్, సాయి అభ్యంకర్లకు కొత్త పోటీ! కోలీవుడ్‌కు.. మరో సంగీత దర్శకుడు
ABN, Publish Date - Nov 29 , 2026 | 11:27 AM
చెన్నై వీధుల్లో, స్టేజ్‌లపై సంగీత ప్రదర్శనలు ఇచ్చిన వరుణ్ మురళికి సినిమా అవకాశం దక్కింది.
చెన్నై వీధుల్లో పాటలు పాడుతూ.. చిన్న చిన్న వేదికలపై సంగీత ప్రదర్శనలు ఇస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఓ యువ కళాకారుడికి ఇప్పుడు వెండితెరపై అవకాశం దక్కింది. ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రంతో సంగీత దర్శకుడిగా కోలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు వరుణ్ మురళి. ఆయనకు ఈ అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? ఈ కొత్త ప్రాజెక్టు విశేషాలేంటో చూద్దాం..
తమిళ చిత్రపరిశ్రమకు మరో సంగీత దర్శకుడు పరిచయమవుతున్నారు. పేరు వరుణ్ మురళి (Varun Murali). చెన్నైలో వీధుల్లో ఆడుతూ పాడుతూ, స్టేజ్ మ్యూజిక్ కచ్చేరీలు నిర్వహిస్తూ వచ్చిన ఈ యువ సంగీత కళాకారుడు సినిమా అవకాశాన్ని దక్కించుకున్నారు.
హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) ప్రధాన పాత్రను పోషించే చిత్రానికి సంగీత స్వరాలు సమకూర్చనున్నారు. 'మావీరన్', '3బీహెచ్‌కే వంటి హిట్ చిత్రాలను నిర్మించిన శాంతి టాకీస్ (Shanthi Talkies) నిర్మించే ఈ చిత్రానికి తరుణ్ తేజ్ (Tarun Teja) దర్శకుడు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సంగీత దర్శకుడు ఎంపికపై నిర్మాణ సంస్థ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. చెన్నై వీధులు, స్టేజీల నుంచి వెండితెరకు, శృతి హాసన్ - శాంతి టాకీస్ చిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రతిభావంతుడైన వరుణ్ మురళిని పరిచయం చేస్తున్నందుకు గర్విస్తున్నాం' అని పేర్కొంది.