సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jailer 2: వర్మ లేని లోటు తెలుస్తుందే..

ABN, Publish Date - Oct 06 , 2026 | 05:02 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న జైలర్ 2 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jailer 2

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న జైలర్ 2 (Jailer 2) పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఇటీవలే జైలర్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మొదటి పార్ట్ లోలానే సెకండ్ పార్ట్ లో కూడా స్టార్ క్యాస్టింగ్ తో సెన్సేషన్ సృష్టించాడు నెల్సన్. సూరజ్ వెంజరమూడు, మిథిన్ చక్రబోర్తి, విద్యా బాలన్, ఎస్ జె సూర్య తో పాటు మొదటి పార్ట్ లో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ కూడా ఉండనున్నారని ట్రైలర్ లో చూపించారు. అంతేనా స్పెషల్ క్యామియోగా హృతిక్ రోషన్ కూడా కనిపించబోతున్నాడని తెలియడంతో సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయింది.


అయితే ఇంతమంది సెకండ్ పార్ట్ లో ఉన్నా కూడా.. మొదటి పార్ట్ లో ఉన్న వర్మ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఇండస్ట్రీ హిట్ కావడంలో రజనీకాంత్ మాస్ మేనియాతో పాటు మెయిన్ విలన్ వినాయకన్ క్యారెక్టర్ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనది. వర్మ క్యారెక్టర్‌లోని డార్క్ హ్యూమర్, క్రూరమైన నవ్వు, సిట్యుయేషనల్ డ్యాన్సులు, ఆయన వైవిధ్యమైన లుక్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఈ ట్రైలర్ లో వర్మ లేని లోటు తెలుస్తోంది. జైలర్ కి ఉన్న మెయిన్ హైలైట్ రజనీ - వర్మ, అతని బ్యాచ్ కామెడీ. ఇందులో అది మిస్ అయ్యినట్లు కనిపిస్తోంది.


మొదటి భాగంలో వర్మ పాత్ర అంతమవ్వడంతో, ఈ సీక్వెల్‌లో ఆ లోటును భర్తీ చేయడానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ క్యారెక్టర్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. వర్మ మేనరిజమ్స్, కామిక్ టైమింగ్ స్థాయిలోనే సూరజ్ పాత్రను కూడా ఎంతో పవర్‌ఫుల్ అండ్ ఫన్నీగా డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రందిలీప్ క్యారెక్టర్ ఐకానిక్ వర్మ క్యారెక్టర్ రేంజ్ వర్త్ ఉంటుందా..? లేదా.. ? అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వినాయకన్ సెట్ చేసిన ఆ బెంచ్ మార్క్ విలనిజంను సూరజ్ మ్యాచ్ చేయగలడా లేదా అనేది సినిమా విడుదలయ్యాక థియేటర్లలో చూస్తేనే స్పష్టత రానుంది. ఏదేమైనా నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, పవర్‌ఫుల్ విలనిజం కాంబినేషన్ ఈ సీక్వెల్‌లోనూ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి:

మాస్ మహారాజాకి విలన్ గా జేడీ చక్రవర్తి..

గురూజీ నిర్ణ‌యం.. లేటైనా ఓ లెక్క ఉంటాది

ఖాకీ డ్రెస్‌లో రా అండ్ వైల్డ్ బీస్ట్.. ‘స్పిరిట్’లో ప్రభాస్ విశ్వరూపం!

Updated Date - Oct 06 , 2026 | 05:02 PM