సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Brigida: ప్రియుడితో ఏడడుగులు వేసిన పవి టీచర్

ABN, Publish Date - Sep 15 , 2026 | 03:49 PM

ఆహా కళ్యాణం వెబ్‌సిరీస్‌లో పవి టీచర్‌ పాత్రతో గుర్తింపు పొందిన తమిళ నటి బ్రికిడా సాగా (Brigida Saga) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

Brigida Saga

ఆహా కళ్యాణం వెబ్‌సిరీస్‌లో పవి టీచర్‌ పాత్రతో గుర్తింపు పొందిన తమిళ నటి బ్రికిడా సాగా (Brigida Saga) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. తన సుదీర్ఘకాల ప్రియుడు, నటుడు అనంత్ రామ్‌ను ఆమె వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. గత జులైలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, తాజాగా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లికి సంబంధించిన వర్ణరంజితమైన ఫోటోలు, వీడియోలను బ్రికిడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలలో ఇద్దరూ సాంప్రదాయ దుస్తులలో మెరిసిపోతూ కనిపించారు.


అనంత్ కూడా నటుడే. వీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నప్పటికీ సినిమా ప్రీమియర్ షోలలో కలుసుకోవడం ద్వారా వీరి పరిచయం ప్రేమగా మారింది. అనంత్ కూడా మంచి మంచి సినిమాలే చేశాడు. ముఖ్యంగా సినిమాపై ఇద్దరికీ ఉన్న ఇష్టం, నటుడు ధనుష్‌కి ఇద్దరూ తీవ్రమైన అభిమానులు కావడం వీరి మధ్య బంధాన్ని మరింత బలపరిచింది. పెళ్లి ప్రతిపాదనతోనే బంధాన్ని ప్రారంభించిన ఈ జంట ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు.


వెబ్‌సిరీస్‌లతో నటన ప్రారంభించిన బ్రికిడా, ఆ తర్వాత వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాతో పాటు ధనుష్ రాయన్ చిత్రంలో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులోనూ సింధూరం వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. నటి బ్రికిడా వివాహ వార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు పవి టీచర్‌ పాత్రను అభిమానించే నెటిజన్లు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Updated Date - Sep 15 , 2026 | 03:56 PM