నీల.. సోషల్ మీడియాను బ్లాస్ట్ చేస్తోంది

ABN , Publish Date - Jun 28 , 2026 | 08:52 PM

అదృష్టం.. ఇండస్ట్రీలో ఎవరికీ ఎప్పుడు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్లకు గుర్తింపు ఎప్పుడు వస్తుందో చెప్పడం అంతకన్నా కష్టం. కొంతమందికి మొదటి సినిమాతోనే వస్తుంది.

Preithy Mukundan

అదృష్టం.. ఇండస్ట్రీలో ఎవరికీ ఎప్పుడు వస్తుందో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్లకు గుర్తింపు ఎప్పుడు వస్తుందో చెప్పడం అంతకన్నా కష్టం. కొంతమందికి మొదటి సినిమాతోనే వస్తుంది. మరికొంతమందికి కొన్ని సినిమాల తరువాత వస్తుంది. ప్రీతి ముకుందన్ (Preithy Mukundan) రెండో కోవకు చెందుతుంది. ప్రస్తుతం కుర్రకారు అంతా ఈ చిన్నదాని నామజాపం చేస్తున్నారు. అందుకు కారణం బ్లాస్ట్ అనే చెప్పాలి. రీసెంట్ గా ప్రీతి నటించిన బ్లాస్ట్ (Blast) సినిమా థియేటర్ లోనే కాకుండా ఓటీటీలో కూడా బ్లాస్ట్ అయ్యింది. ప్రీతి ఫైట్స్ కి, న్యాచురల్ గా కనిపించిన ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అసలు ఎవర్రా ఈ అమ్మాయి.. పిచ్చెక్కించింది అంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.


ఆశా కూడా సాంగ్ తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ క్రియేట్ చేసింది ప్రీతి. ఆ సాంగ్ లో స్టెప్స్, ఎక్స్ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయ్యారు. ఇక ఇలాంటి అమ్మాయి హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందా అనుకొనేలోపు శ్రీవిష్ణు సరసన ఓం భీమ్ బుష్ లో నటించింది. కానీ, ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత తెలుగులో కన్నప్పతో మరోసారి ఎంట్రీ ఇచ్చింది. మంచు విష్ణు నటించిన ఈ చిత్రంలో గ్లామర్ ఒలకబోసి ఇండస్ట్రీని షేక్ ఆడించింది.ఈ సినిమా కూడా ఈ చిన్నదానికి మంచి గుర్తింపును రాబట్టలేకపోయింది. కన్నప్ప తరువాత తమిళ్ లో అడుగుపెట్టిన ప్రీతి.. ఈ ఏడాది బ్లాస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్లాస్ట్. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నీల పాత్రలో ప్రీతి నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. తప్పు చేస్తే ఎలాంటివారినైనా ఎదురించాలి అనే ఒక అమ్మాయి.. ఒక గ్రామాన్ని.. మాఫియా గ్యాంగ్ నుంచి ఎలా కాపాడింది అనే కథతో బ్లాస్ట్ తెరకెక్కింది. ఇక ఈ చిత్రానికి నీలనే హైలైట్. ఆ ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, నటన కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. థియేటర్ లో మిస్ అయినవారందరూ.. ఓటీటీలో చూసి.. ఎలారా ఈ అమ్మాయిని ఇప్పటివరకు మిస్ అయ్యాం అంటూ బాధపడుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నీల వీడియోలే కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తరువాత కచ్చితంగా ప్రీతి రేంజ్ మారుతోంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి ముందు ప్రీతి ఎలాంటి అవకాశాలను అందుకొని ఏ రేంజ్ హీరోయిన్ గా నిలబడుతుందో చూడాలి.

Updated Date - Jun 28 , 2026 | 08:52 PM