సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వెంట్రుకల అక్రమ రవాణా నేపథ్యంలో ‘బ్లాక్ గోల్డ్’

ABN, Publish Date - Nov 08 , 2026 | 09:54 PM

వెంట్రుకల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ‘బ్లాక్ గోల్డ్’ నవంబర్ 13న విడుదల కానుంది.

black gold

వెంట్రుకల మాఫియాను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం బ్లాక్ గోల్డ్ (Black Gold) ఈ నెల 13న విడుదల కానుంది. వెట్రి (Vetri) కథానాయకుడు కాగా, ఇతర పాత్రల్లో లివింగ్టన్, ప్రియాలయ, తులసి, బిగ్బాస్ అభిరామి. ఏ.వెంకటేష్ తదితరులు నటించారు. ఎం.మూర్తి నిర్మాణంలో ఎంఎం స్టూడియోస్ పతాకంపై ధీరన్ అరుణ్ కుమార్ దర్శకత్వంలో తరకెక్కింది. ఎవరికీ తెలియకుండా జరిగే అక్రమ వ్యాపారం మధ్యతరగతి యువకుడిని ఎలా ప్రభావితం చేస్తుందన్నదే ఈ చిత్ర కథ. వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.

ఈ నేపథ్యంలో చిత్ర ఆడియో రిలీజ్ వేడుక నగరంలో తాజాగా నిర్వహించింది. ఇందులో హీరో వెట్రి మాట్లాడుతూ, 'నా సినీ ప్రయాణంలో 'బ్లాక్ గోల్డ్ చాలా ముఖ్యమైనది. సాధారణంగా చాలా మంది నల్ల బంగారం అంటే బొగ్గు లేదా ముడి చమురు, మిరియాలు అని అనుకుంటారు. కానీ, ఈ చిత్రంలో వెంట్రుకల అక్రమ రవాణాపై అస్త్రాన్ని ఎక్కుపెట్టాం. దీంతో పాటు తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగ సంబంధాన్ని సృష్టించారు. ఈ కథను తొలిసారి విన్నపుడే నాకు నచ్చింది. ఈ చిత్రాన్ని విభిన్నమైన కథాంశంతో, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు అద్భుతంగా రూపొందించారు' అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇదే పేరుతో సంయుక్త మీన‌న్ లీడ్ రోల్‌లో తెలుగులోనూ ఓ భారీ యాక్ష‌న్ చిత్రం రూపొందుతుండ‌డం విశేషం.

Updated Date - Nov 08 , 2026 | 09:59 PM