ఓటీటీలో పేలడానికి సిద్దమైన 'బ్లాస్ట్'..
ABN , Publish Date - Jun 15 , 2026 | 10:06 PM
ఈమధ్యకాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకే పెద్ద పీట వేస్తున్నారు. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా.. స్టార్స్ ఉన్నారా.. వేరే భాషా చిత్రమా అనేది చూడడం లేదు. కథలో సత్తా ఉందా లేదా ఇదొక్కటే చూస్తున్నారు.
ఈమధ్యకాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకే పెద్ద పీట వేస్తున్నారు. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా.. స్టార్స్ ఉన్నారా.. వేరే భాషా చిత్రమా అనేది చూడడం లేదు. కథలో సత్తా ఉందా లేదా ఇదొక్కటే చూస్తున్నారు. అలా మంచి కంటెంట్ తో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం బ్లాస్ట్. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja), అభిరామి (Abhirami), ప్రీతి ముకుందన్ (Preity Mukundhan) ప్రధాన పాత్రల్లో సుభాష్ కె. రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం బ్లాస్ట్ (Blast). గత నెల మే 28 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా డీసెంట్ హిట్ అందుకొని రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.
థియేటర్లలో తన మార్క్ యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్లాస్ట్ చిత్రం ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 25 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఒక మధ్యతరగతి కుటుంబం తన ఉనికిని కాపాడుకోవడానికి పవర్ ఫుల్ విలన్ తో చేసే పోరాటమే ఈ సినిమా మెయిన్ స్టోరీ.
రాజారామ్ (అర్జున్) ఒక మార్షల్ ఆర్ట్స్ టీచర్. తన భార్య నీలవేణి (అభిరామి), కూతురు నీలా (ప్రీతి ముకుందన్)లతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అయితే వారి ప్రశాంతమైన జీవితంలోకి ఒక కార్పొరేట్ విలన్ వరుణ్ దయాలన్ (జాన్ కొక్కెన్) ప్రవేశిస్తాడు. తమ ఊరిని మైనింగ్ మాఫియా నుండి కాపాడుకోవడానికి ఈ కరాటే ఫ్యామిలీ ఎలాంటి సాహసాలు చేసింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. దర్శకుడు సుభాష్ కె. రాజ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌కు మార్షల్ ఆర్ట్స్ యాక్షన్‌ను జోడించి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాదు. ముఖ్యంగా కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ కింగ్ అర్జున్ నుంచి చాలా కాలం తర్వాత ఒక పక్కా పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా రావడంతో, ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్ లో బ్లాస్ట్ అయిన ఈ సినిమా ఓటీటీలో ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందో చూడాలి.