Anupama Parameswaran: నరకం చూపించాడు.. తమ్ముడిని తాకాలన్నా భయపడ్డా
ABN, Publish Date - Aug 12 , 2026 | 09:43 PM
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ , కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌ల మధ్య గత కొంతకాలంగా గాఢమైన ప్రేమాయణం సాగిన సంగతి తెలిసిందే.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), కోలీవుడ్ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) ల మధ్య గత కొంతకాలంగా గాఢమైన ప్రేమాయణం సాగుతోందని వార్తలు రావడం తెల్సిందే. గతంలో వీరిద్దరూ కలసి ఉన్న ఫోటోలు, కిస్ చేసుకుంటున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చి తీవ్ర దుమారం రేపాయి. ఒకానొక దశలో వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. అయితే, అందరూ అనుకున్నట్లుగా ఆ ప్రేమకథ సజావుగా సాగలేదని, ఆ బంధం వెనుక తనకు ఎదురైన చేదు అనుభవాలను, తీవ్రమైన మానసిక వేదనను అనుపమ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మనోగతాన్ని బయటపెట్టింది. వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారన్న వార్తలపై అనుపమ స్పందించింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. తాను గడిచిన రెండేళ్ల కాలంలో తీవ్రమైన నార్సిసిస్టిక్ అబ్యూజ్, తీవ్ర శారీరక, మానసిక క్షోభను అనుభవించానని తెలిపింది. ప్రారంభంలో ఎంతో ప్రేమను కురిపించిన భాగస్వామి, క్రమంగా తన జీవితంపై, దుస్తుల ఎంపికపై, సోషల్ మీడియా పోస్టులపై, చివరికి సినిమాల ఎంపికపై కూడా తీవ్రమైన నియంత్రణ సాధించడం మొదలుపెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం 3 నెలల పరిచయంలోనే ఎంగేజ్‌మెంట్, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి మాట్లాడారని, కానీ అది ప్రేమతో కాకుండా తనను నటన మాన్పించి పూర్తిగా కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నమని గ్రహించి తనే పదే పదే ఎంగేజ్‌మెంట్‌ను వాయిదా వేస్తూ వచ్చానని వివరించింది.
అంతేకాకుండా ఈ మానసిక ఒత్తిడి వల్ల తాను డిప్రెషన్, యాంగ్జైటీ మందులు వాడాల్సి వచ్చిందని, తన కెరీర్‌లోనే పెద్ద హిట్ అయిన డ్రాగన్ సినిమా ప్రమోషన్లకు కూడా వెళ్లలేకపోయానని చెప్పింది. షూటింగ్ స్పాట్‌లో పానిక్ అటాక్స్ వచ్చి వ్యాన్ లోపలికి వెళ్లి ఏడ్చేదాన్నని, దీనివల్ల అనేకసార్లు షూటింగ్‌లు ఆగిపోయాయని పేర్కొంది. తోటి నటీనటులతో మాట్లాడటానికి, చివరికి తన సొంత సోదరుడిని తాకడానికి కూడా భయపడే పరిస్థితికి చేరానని తెలిపింది.
అయితే ఈ టాక్సిక్ బంధం నుంచి బయటపడి, తాను పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత మాత్రమే సమాజంలో ఇలాంటి మానసిక వేధింపులపై అవగాహన తెచ్చేందుకు ఈ విషయాలను ధైర్యంగా పంచుకుంటున్నానని అనుపమ వెల్లడించింది. ప్రస్తుతం అనుపమ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నిజంగా ఒక స్టార్ హీరో కొడుకు అయ్యి ఉండి.. ధ్రువ్ ఈ విధంగా ఎలా చేయగలిగాడు అని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్న ధ్రువ్ పై ఇలాంటి ఆరోపణలు వస్తే.. ముందు ముందు అతని భవిష్యత్ ఎలా ఉండబోతుందో అని విక్రమ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.