సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనిరుధ్- కావ్య మారన్ రిసెప్షన్.. తరలివచ్చిన సినీరాజకీయ లోకం

ABN, Publish Date - Nov 21 , 2026 | 08:45 PM

తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ (Kaviya Maran) వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది.

Anirudh Ravichander

తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ (Kaviya Maran) వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది. గ్రీస్‌లో నవంబర్ 11న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగ్గా, శనివారం (నవంబర్ 21) చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ వేదికగా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకలో నూతన వధూవరులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఈ హై-ప్రొఫైల్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, పళనిస్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి ప్రముఖ రాజకీయ నేతలు వేడుకకు విచ్చేశారు. మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్, రాధికా శరత్‌కుమార్, దర్శకుడు అట్లీ, సిద్ధార్థ్ - అదితి రావు హైదరీ జంట, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు వంటి సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీతో అనుబంధం ఉన్న క్రికెట్ ప్రముఖులు కూడా రిసెప్షన్‌లో పాల్గొని సందడి చేశారు. సినీ, రాజకీయ, క్రీడా లోకాల కలయికతో చెన్నైలో జరిగిన ఈ రిసెప్షన్ వేడుక ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

Updated Date - Nov 21 , 2026 | 08:53 PM