Anirudh: అమ్మ.. బక్కోడా.. ఇంతమంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపావా
ABN, Publish Date - Oct 17 , 2026 | 08:32 PM
సౌత్ ఇండియాలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, అనిరుధ్ ల వివాహం నిశ్చయమైన విషయం తెల్సిందే.
సౌత్ ఇండియాలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, అనిరుధ్ ల వివాహం నిశ్చయమైన విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహాం నవంబర్ 11 గ్రీస్ లో అత్యంత ఘనంగా జరగనుంది. ఇక నవంబర్ 21 న చెన్నైలో రిసెప్షన్ జరగనుంది. తెలుగు, తమిళ్ స్టార్స్.. ఈ రిసెప్షన్ కి హజరుకానున్నారు. ఇక అనిరుధ్- కావ్య మారన్ పెళ్లి అనౌన్స్ మెంట్ తరువాత సింగర్ జోనితా గాంధీ లవ్ బ్రేకప్ సాంగ్ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు జోనితా పెట్టిన ఈ సాడ్ సాంగ్ స్టోరీ ఆ వార్తలు నిజమే అని నమ్మేలా చేశాయి. అయితే అనిరుధ్ ఒక్క జోనితాతోనే బ్రేకప్ అవ్వలేదు. ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ఆయన పేరు మీద వచ్చిన లవ్ ఎఫైర్లు, రూమర్లు చాలా ఉన్నాయి.
'3' సినిమాలోని కొలవెరి డి పాటతో ఒక్కసారిగా గ్లోబల్ లెవెల్లో పాపులర్ అయిన అనిరుధ్, కేవలం మ్యూజిక్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం వార్తల్లో నిలిచేవాడు. కెరీర్ ప్రారంభంలోనే నటి ఆండ్రియా జెరెమియాతో ఆయన ఉన్న ప్రైవేట్ ఫోటోలు లీక్ అవ్వడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య డేటింగ్ నడిచిందని, కొన్నాళ్లకు బ్రేకప్ అయిందని ప్రచారం జరిగింది.
ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్తో అనిరుధ్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు లీక్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరూ తాము మంచి స్నేహితులమని చెప్పడం, కీర్తి పెళ్లి కూడా జరిగిపోవడంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. వీటితో పాటు నేచురల్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్, అలాగే పూజా హెగ్డేతో కూడా అనిరుధ్ డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇలా కెరీర్ ఆరంభం నుంచి పలువురు భామలతో పేర్లు వినిపించినప్పటికీ, అనిరుధ్ ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలపై బహిరంగంగా స్పందించలేదు. ఇప్పుడు సన్రైజర్స్ ఓనర్ కావ్య మారన్తో పెళ్లి వార్తలు రావడంతో, అభిమానులు ఈ క్రేజీ జోడీకి సోషల్ మీడియా వేదికగా ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.