'బ‌త్తా'నే మ‌రిచి పోలేదు.. మ‌ళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వ‌స్తున్న విజ‌య్ సేతుప‌తి

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:19 PM

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి త్వ‌ర‌లో మ‌రో మూడు విభిన్న త‌ర‌హా చిత్రాల‌తో అల‌రించేందుకు సిద్ద‌మ‌య్యాడు.

Vijay Sethupathi

ఈ ఏడాది ఇప్ప‌టికే గాంధీ టాక్స్ (Gandhi Talks), బ‌త్తా (Baththa) వంటి ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌తో పాటు జైల‌ర్ 2 (Jailer 2) లో గెస్ట్ రోల్‌తో అల‌రించిన మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి త్వ‌ర‌లో మ‌రో మూడు విభిన్న త‌ర‌హా చిత్రాల‌తో అల‌రించేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఇందులో భాగంగా డిసెంబ‌ర్‌ నెల‌లో సేతుప‌తి మిస్కిన్ కాంబోలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ట్రైన్ (Train) విడుద‌ల కానుంది. ఇక సూపర్‌ డీల‌క్స్ వంటి క‌ల్ట్ చిత్రం అనంత‌రం ఆ మూవీ డైరెక్ట‌ర్‌తో క‌లిసి చేసిన‌ పాకెట్‌ నావెల్ అనే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో, పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స్ల‌మ్ డాగ్ (Slum Dog: 33 Temple Road) వ‌చ్చే వేస‌విలో విడుద‌ల కానున్నాయి.

అయితే.. ఇప్ప‌టికే వ‌చ్చే సంక్రాంతికి తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ సినిమాలు రిలీజ్‌కు ఎప్పుడో ఖ‌ర్చీప్ వేసుకుంటే తాజాగా ఇప్పుడు పాకెట్ నావెల్ సినిమా ఆ లిస్టులో చేరి పండుగ పోటీని మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చింది. చాలా విరామం త‌ర్వాత త్యాగరాజన్ కుమారరాజన్ (Thiagarajan Kumararaja) సేతుప‌తితో రూపొందిన చిత్రం పాకెట్ నావల్ (Pocket Novel). జనవరి 14వ తేదీ సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ టైలర్ డర్డెన్ అండ్ కినోఫెస్ట్ తన ట్విటర్ హ్యాండిల్‌లో వెల్లడించింది.

Pocket Novel.jfif

సూపర్ డీలక్స్ (Super Deluxe) వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత త్యాగరాజన్ కుమారరాజన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబోలో రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ సేతుపతితో పాటు కన్నడ నటుడు రాజ్ బీ శెట్టి (Raj B. Shetty), మాళవిక మోహనన్ (Malavika Mohanan), కిషోర్ (Kishore) ముఖ్య పాత్రలను పోషించారు. రాజ్ బీ శెట్టికి ఇది తొలి తమిళ చిత్రం కావడం గమనార్హం. నిర్మాతతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఇళయరాజా (Ilaiyaraaja) అనివార్య కారణాలతో తప్పుకున్నారు. దీంతో యువ సంగీత ద్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతం అందించారు.

Updated Date - Nov 08 , 2026 | 05:36 PM