సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Divyabharathi: ఒరేయ్.. బికినీ ఫోటోలు నిజమనుకున్నారు కదరా..

ABN, Publish Date - Sep 26 , 2026 | 01:56 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తుపట్టడం అత్యంత కష్టతరంగా మారింది.

Divyabharathi

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో ఏది నిజమో, ఏది అబద్ధమో గుర్తుపట్టడం అత్యంత కష్టతరంగా మారింది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ దాని దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన కథానాయికల ఫోటోలను AI సహాయంతో మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరంగా ప్రచారం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా కోలీవుడ్ హాట్ బ్యూటీ దివ్యభారతి (Divya Bharathi) ఫోటోలు కూడా ఏఐ ద్వారా మార్ఫింగ్ చేశారు.


తమిళ చిత్రం బ్యాచిలర్ లో జి.వి. ప్రకాష్ కుమార్ సరసన కథానాయికగా నటించి చిత్రసీమలోకి అడుగుపెట్టిన దివ్యభారతి, తన తొలి చిత్రంతోనే నటనతో పాటు అందచందాలతో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాతమదయా నై కట్టై, ఆసై వంటి చిత్రాలతో తమిళంలో మంచి గురింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా ఈమెకు సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ, తన ఫ్యాషన్ సెన్స్, గ్లామరస్ స్టిల్స్‌తో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది.


ఇక దివ్యభారతి ఇటీవల ఆకుపచ్చ రంగు డిజైనర్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే, కొందరు సైబర్ నేరగాళ్లు ఈ ఒరిజినల్ ఫోటోలను ఏఐ డిప్‌ఫేక్ టూల్స్ ద్వారా దారుణంగా ఎడిట్ చేశారు. ఆమె గ్రీన్ డ్రెస్‌ను తొలగించి, ఎర్రటి బికినీ ధరించినట్లుగా అత్యంత అసభ్యకర రీతిలో మార్చి నెట్టింట పోస్ట్ చేశారు. మొదటి చూపులో ఇవి నిజమైన ఫోటోలా అన్నంత సహజంగా ఎడిట్ చేయడం అందరినీ షాక్‌కి గురిచేసింది. దీంతో నెటిజన్స్ ఒరేయ్.. నిజమే అనుకున్నాం కదరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Sep 26 , 2026 | 02:07 PM