మహిళా దర్శకులను.. వేరుగా చూడొద్దు
ABN, Publish Date - Nov 27 , 2026 | 09:23 AM
చిత్రపరిశ్రమలో మహిళా దర్శకులను ప్రత్యేకంగా చూడొద్దని హీరోయిన్ భవ్య త్రిఖ అన్నారు
చిత్ర పరిశ్రమలోని మహిళా దర్శకులను వేరు చేసి చూడొద్దని యువ హీరోయిన్ భవ్య త్రిఖ (Bhavya Trikha) అన్నారు. 'కదిర్' అనే చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన భవ్య.. ఆ తర్వాత 'జో', 'ఇడి మిన్నల్ కాదల్', 'బన్ బట్టర్ జామ్' వంటి పలు చిత్రాల్లో నటించారు.
తాజాగా ఆమె హీరోయిన్గా నటించిన చిత్రం సిగ్నల్ ఎట్ 11:30 (Signal at 11:30) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భవ్య త్రిఖ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 'దర్శకురాలు మలర్విళి (Malarvizhi Natesan) కథ చెప్పడం, ఆమె చూపిన విజన్ ఈ సినిమాతో మొదట కనెక్ట్ కావడా నికి ఓ ముఖ్య కారణం. దర్శకురాలితో కలిసి పని చేయబోతున్నామనే విషయం నాకు బాగా నచ్చింది.
సినిమా గురించి చర్చ జరిగినపుడు, మహిళ దర్శకత్వం వహించారన్న విషయం కంటే, ఆమె ఎలా పనిచేశా రన్నది ముఖ్యం. అందువల్ల చిత్రపరిశ్రమలో మహిళా దర్శకులను వేరుగా చూడొద్దు. నా మొదటి సినిమాలో నటుడు సంతోష్ ప్రతాప్ (Santhosh Prathap) తో కలిసి పనిచేశాను. ఈ సినిమాలో ఆయనతో మళ్ళీ జతకట్టడం చాలా సంతోషంగా ఉంది. తోటి నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొ న్నారు. కాగా ఈ చిత్రంలో తెలగుమ్మాయి పూజిత పొన్నాడ (Pujita Ponnada) మరో కథానాయికగా చేసింది.