అర్జున్ సర్జా చిన్న కూతురు పెళ్లి.. పెద్ద అల్లుడు మిస్సింగ్
ABN, Publish Date - Oct 25 , 2026 | 07:58 PM
యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది బ్లాస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.
యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది బ్లాస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అర్జున్ సర్జా ఇంత పెళ్లి భాజాలు మోగాయి. ఇప్పటికే ఆయన పెద్ద కూతురు, నటి ఐశ్వర్య అర్జున్ వివాహం, నటుడు తంబీ రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. తాజాగా అర్జున్ రెండో కూతురు అంజనా కూడా పెళ్లి పీటలు ఎక్కింది. దశాబ్దానికి పైగా సాగిన తన సుదీర్ఘ ప్రేమ ప్రయాణాన్ని ఆమె ఎట్టకేలకు శుభముహూర్తాన పెళ్లి పీటల వరకు తీసుకువచ్చింది.
అంజన సర్జా అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుంటున్న సమయంలో ఆమె ఇసాయ్ నట్టర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, గత 14 ఏళ్లుగా వీరిద్దరూ రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇరు కుటుంబాల సమ్మతితో గతేడాది ఏప్రిల్లో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. తాజాగా అక్టోబర్ 19న వేరే దేశంలో అత్యంత ఘనంగా వీరి వివాహ వేడుక ముగిసింది. విదేశాల్లో పెళ్లి జరిగినప్పటికీ, పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. సాంప్రదాయ వస్త్రధారణలో అంజన, ఇసాయ్ నట్టర్ జంట మెరిసిపోయారు. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను అంజన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో, సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ నూతన దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే ఈ వివాహా వేడుకకు అర్జున్ పెద్ద అల్లుడు, ఐశ్వర్య భర్త ఉమాపతి హాజరుకాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంటికి పెద్ద అల్లుడు అయ్యి ఉండి, మరదలు పెళ్లికి ఎందుకు హాజరుకాలేదని నెటిజన్స్ రకరకాల అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. కొందరు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడని అంటుంటే.. ఇంకొందరు మాత్రం ఏమైనా విభేదాలు నెలకొన్నాయా అని ఆరాలు తీస్తున్నారు. మరి ఉమాపతి.. మరదలు పెళ్లికి ఎందుకు అటెండ్ కాలేదో తెలియాలంటే ఆయన స్పందించేవరకు ఆగాల్సిందే.