సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vikram: పారితోషికం.. తగ్గించిన విక్ర‌మ్‌?

ABN, Publish Date - Jun 16 , 2026 | 08:53 PM

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తన కొత్త సినిమా కోసం పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు సమాచారం.

vikram

తమిళ హీరో ‘చియాన్‌’ విక్రమ్ (Chiyaan Vikram) కొత్త సినిమా ఇటీవలే మొదలైంది.యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఆనంద్‌ శంకర్ (Anand Shankar) దర్శకత్వం వహిస్తున్నారు. రెగ్యులర్‌గా తను తీసుకునే భారీ పారితోషికం కాకుండా కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఈ సినిమాకు తీసుకుంటున్నట్లు సమాచారం.

చిత్ర నిర్మాణ వ్యయంలో అధిక శాతం హీరోల పారితోషికం కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఇటీవలి కాలంలో విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో విక్రమ్‌ ఇలా తన పారితోషికం తగ్గించుకోవడం అభినందనీయమే అంటున్నాయి తమిళ చిత్రరంగ వర్గాలు.

తెలుగులో కొంతమంది హీరోలు వెళుతున్న బాటలో తను కూడా నడవాలని, పారితోషికం తగ్గించుకుని, సినిమా లాభాల్లో వాటా తీసుకోవాలని విక్రమ్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. రియా శింబు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం పేరు ఏమిటన్నది త్వరలోనే వెల్లడిస్తారు. ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది ఆరంభంలో కానీ ఈ సినిమా విడుదలవుతుంది.

Updated Date - Jun 16 , 2026 | 08:53 PM