ప్రముఖ బుల్లితెర నటుడు కన్నుమూత
ABN, Publish Date - Jul 30 , 2026 | 10:10 AM
తమిళ టీవీ సీరియల్ నటుడు వీ.సీ. జయమణి (79) గుండెపోటుతో మృతిచెందారు.
తమిళ టీవీ సీరియల్స్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడిగా జయమణి (79) (VC Jayamani) గుండెపోటుతో మృతిచెందారు. తిరుమది సెల్వం (Thirumathi Selvam), మెట్టివొలి, కల్యాణ పరుసు వంటి సుమారు 50కి పైగా టీవీ సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న జయమణి సౌత్ ఇండియా నడిగర్ సంఘం సభ్యుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ సంఘ సభ్యుడిగా ఉన్నారు.
ప్రస్తుతం ఆయన శిరగడిక్క ఆశై అనే సీరియల్లో నటిస్తున్నారు. కాగా మంగళవారం -సాయంత్రం హఠాత్తుగా గుండెపోటుతో మరణిం చారు. ఆయన భౌతికకాయానికి సీనియల్ ఆర్టిస్టులు, ప్రజలు, అభిమానులు అంజలి ఘటించారు.