Kollywood: ఏడేళ్ళ ఫిల్మ్ అవార్డ్స్ ఒక్కేసారి...

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:32 PM

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. 2016 నుండి 2022 వరకూ ప్రకటించిన అవార్డులను ఫిబ్రవరి 13న విజేతలకు అందించబోతోంది. సినిమా అవార్డుల ప్రకటనతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Tamilanadu State Film Awards

తెలుగులో మాదిరి గానే తమిళనాడులో కూడా స్టేట్ ఫిల్మ్ అవార్డులను కొన్నేళ్ళుగా ప్రభుత్వం ఇవ్వనే లేదు. గత యేడాది తెలంగాణలో రేవంత్ రెడ్డి, నంది అవార్డుల స్థానంలో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రవేశ పెట్టి 2014 నుండి 2023 వరకూ కొన్ని కేటగిరిల్లో అవార్డులను అందించారు. 2024కు పలు కేటగిరిల్లో అవార్డులు ఇచ్చారు. అయితే.. తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఇప్పుడు 2016 నుండి 2022 వరకూ వివిధ కేటగిరిల్లో అవార్డులను గురువారం ప్రకటించింది. దాంతో వివిధ సంవత్సరాలకు గానూ విజయ్ సేతుపతి, కార్తీ, ధనుష్‌, పార్తీబన్, సూర్య, ఆర్య, విక్రమ్ ప్రభు ఉత్తమ నటులుగా, కీర్తి సురేశ్‌, నయనతార, జ్యోతిక, మంజువారియర్, అపర్ణ బాలమురళి, లిజోమోల్ జోస్, సాయి పల్లవి ఉత్తమ నటీమణులుగా ఎంపికయ్యారు. విజేతలందరికీ అవార్డులను ఫిబ్రవరి 13న సాయంత్రం చెన్నైలోని కళైవాణర్ అరంగంలో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రదానం చేస్తారు.


2016 విజేతలు

ఉత్తమ చిత్రం (ప్రథమ బహుమతి): మానగరం

ఉత్తమ చిత్రం (ద్వితీయ బహుమతి): పురియాత పుతిర్

ఉత్తమ చిత్రం (తృతీయ బహుమతి): మావీరన్ కిట్టు

ప్రత్యేక బహుమతి: మానుసంగడ

మహిళా సాధికారతపై ఉత్తమ చిత్రం: అరువి

ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి (పురియాత పుతిర్)

ఉత్తమ నటి: కీర్తి సురేష్ (పాంబు సట్టై)

ఉత్తమ దర్శకుడు: లోకేష్ కనగరాజ్ (మానగరం)

ఉత్తమ సంగీత దర్శకుడు: సామ్ సీఎస్ (పురియాత పుతిర్)

...

2017 విజేతలు

ఉత్తమ చిత్రం: అరమ్

ఉత్తమ నటుడు: కార్తి (తీరన్ అధిగారం ఒండ్రు)

ఉత్తమ నటి: నయనతార (అరమ్)

ఉత్తమ దర్శకుడు: పుష్కర్–గాయత్రి (విక్రమ్ వేదా)

ఉత్తమ సంగీత దర్శకుడు : హిప్ హాప్ తమిళ (కావన్)

...

2018 విజేతలు

ఉత్తమ చిత్రం: పరియేరుమ్ పెరుమాళ్

ఉత్తమ నటుడు: ధనుష్ (వడ చెన్నై)

ఉత్తమ నటి: జ్యోతిక (చెక్క చివంత వానం)

ఉత్తమ దర్శకుడు: మారి సెల్వరాజ్ (పరియేరుమ్ పెరుమాళ్)

ఉత్తమ సంగీత దర్శకుడు: సంతోష్‌ నారాయణన్ (వడ చెన్నై)

...

2019 విజేతలు

ఉత్తమ చిత్రం: అసురన్

ఉత్తమ నటుడు: ఆర్. పార్థిబన్ (ఒత్త సెరుప్పు సైజ్ 7)

ఉత్తమ నటి: మంజు వారియర్ (అసురన్)

ఉత్తమ దర్శకుడు: పార్థిబన్ (ఒత్త సెరుప్పు సైజ్ 7)

ఉత్తమ సంగీత దర్శకుడు: తమన్ (మగముని)

...

2020 విజేతలు

ఉత్తమ చిత్రం: కూజాంగళ్

ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు)

ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు)

ఉత్తమ దర్శకురాలు: సుధా కొంగర (సూరరై పోట్రు)

ఉత్తమ సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్ కుమార్ (సూరరై పోట్రు)

...

2021 విజేతలు

ఉత్తమ చిత్రం: జై భీమ్

ఉత్తమ నటుడు: ఆర్య (సార్పట్టా పరంబరై)

ఉత్తమ నటి: లిజోమోల్ జోస్ (జై భీమ్)

ఉత్తమ దర్శకుడు: థా. సే. జ్ఞానవేల్ (జై భీమ్)

ఉత్తమ సంగీత దర్శకుడు: సీన్ రోల్డన్ (జై భీమ్)

...

2022 విజేతలు

ఉత్తమ చిత్రం: గార్గి

ఉత్తమ నటుడు: విక్రమ్ ప్రభు (తానక్కరణ్)

ఉత్తమ నటి: సాయి పల్లవి (గార్గి)

ఉత్తమ దర్శకుడు: గౌతమ్ రామచంద్రన్ (గార్గి)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఏ. ఆర్. రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1)

Updated Date - Jan 30 , 2026 | 05:35 PM