Vijay: సినిమా కోసం రాజన్ చేసిన సేవలు చిరస్మరణీయం..
ABN, Publish Date - May 19 , 2026 | 12:41 PM
ప్రముఖ సినీ నిర్మాత కె.రాజన్ (k Rajan) ఆత్మహత్య చేసుకోవడంపై ముఖ్యమంత్రి విజయ్ తన ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు.
ప్రముఖ సినీ నిర్మాత కె. రాజన్ (k Rajan) ఆత్మహత్య చేసుకోవడంపై ముఖ్యమంత్రి విజయ్ తన ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ‘తమిళ చిత్రపరిశ్రమలో సీనియర్ నిర్మాత, దర్శకుడు, నటుడు, సినీ పంపిణీదారుడు, పలు మంచి చిత్రాలను నిర్మించిన నిర్మాత కె. రాజన్ మరణ వార్త తీవ్ర ఆవేదన కలిగించింది. ముఖ్యంగా చిన్న నిర్మాతల సంక్షేమం కోసం, పంపిణీదారుల హక్కుల పరిరక్షణ కోసం తమిళ చిత్రపరిశ్రమలో ధైర్యంగా, ముక్కుసూటిగా మాట్లాడే స్వభావమున్న రాజన్‌కు కొన్ని దశాబ్దాలుగా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉంది. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఇంటిపెద్ద కోల్పోయిన దుఃఖసాగరంలో ఉన్న రాజన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన వారికి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలుపుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
ఆదివారం అడయారు బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న నిర్మాత రాజన్ అంత్యక్రియలు సోమవారం స్థానిక రాయపురం కాశీమేడు శ్మశానవాటికలో పూర్తి చేశారు.