దయచేసి మగాళ్లను ప్రశాంతంగా బతకనివ్వండి
ABN, Publish Date - Mar 13 , 2026 | 08:10 AM
దయచేసి మగాళ్లను ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ తమిళ స్టార్ హీరో రవి మోహన్ మహిళలకు విజ్ఞప్తి చేశారు.
దయచేసి మగాళ్లను ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ తమిళ స్టార్ హీరో రవి మోహన్ (Ravi Mohan) మహిళలకు విజ్ఞప్తి చేశారు. తన భార్య ఆర్తి రవి (Aarthi) తో విడాకుల కోసం న్యాయపోరాటం చేస్తున్న రవి మోహన్ (జయం రవి) తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహిళలపై తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు.
'ఎల్లవేళలా మహిళలే కరెక్ట్ అనే భావన ప్రతి ఒక్క స్త్రీలో నెలకొంది. అందువల్ల మీరు చెప్పదలచుకున్న విషయాన్ని మీరు చెప్పండి. వాస్తవానికి ఈ సమాజంలో ఎక్కువగా విధి వంచితులు పురుషులే. ఈ విషయాన్ని మన న్యాయస్థానాలు కూడా గ్రహించాయి. ఏదో ఒక రోజున నా మనసును, నేను ప్రేమించే మనుషుల కోసం చేసిన త్యాగాల గురించి మీరంతా అర్ధం చేసుకుంటారు. దయచేసి ఒక మగాడిని ప్రశాంతంగా బతకనివ్వండి. మీ కుత్సిత ఆలోచనలు మీ వద్దనే ఉంచుకోండి. నేను మళ్లీ నా మార్గంలో ప్రయాణం మొదలు పెట్టాను' అని పేర్కొన్నారు.
భార్య ఆర్తి నుండి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన రవి ఆపై తన మాకాం మరో చోటికి మార్చి ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్షిస్ (Keneeshaa Francis)తో కలిసి ఉంటున్నారు. అంతేగాక రవి మోహన్ (Ravi Mohan Studios) పేరిట ఓ సినిమా స్టూడియో ఏర్పాటు చేశారు. ఓ వైపు వరుసగా సినిమాల్లో నటిస్తూనే సినిమా నిర్మాణాలు కూడా చేయడం ప్రారంభించారు. మరోవైపు దర్శకత్వంలోకి అడుగు పెట్టి ఓ మల్టీ స్టారర్ చిత్రం రూపొందిస్తున్నారు.