తండ్రి మృతి.. హీరో జీవా కన్నీటి పర్యంతం! వీడియో వైరల్
ABN, Publish Date - May 06 , 2026 | 11:09 AM
తండ్రి ఆర్‌బీ చౌదరి మరణాన్ని తట్టుకోలేక హీరో జీవా కన్నీటి పర్యంతమయ్యారు.
తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్స్ (Super Good Films) అధినేత ఆర్‌బీ చౌదరి ( RB Choudhary) మరణంతో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా ఆయన కుమారుడు, హీరో జీవా (jeeva) ఈ విషాదాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు.
తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే జీవా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సన్నిహితులను హత్తుకుని, ఫోన్‌లో మాట్లాడుతూనే బోరున విలపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్నేహితులు, సినిమా నటులు వైభవ్, సతీష్, జై వంటి వారు జీవా వెన్నంటే ఉన్నారు.
ఆర్‌బీ చౌదరి దక్షిణాది సినీ రంగంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగు, తమిళ భాషల్లో అనేక హిట్ సినిమాలు అందించి నిర్మాతగా సుస్థిర స్థానం సంపాదించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఓ కీలక వ్యక్తిని కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ఆర్‌బీ చౌదరి అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నాయి. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరై ఆయనకు నివాళులు అర్పించనున్నారు.