Cheran: మాట మార్చి విజయ్ కు క్షమాపణలు..
ABN, Publish Date - May 07 , 2026 | 10:00 AM
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హీరో విజయ్‌కు ప్రముఖ దర్శకుడు చేరన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు.
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హీరో విజయ్‌కు ప్రముఖ దర్శకుడు చేరన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. విజయ్.. రాజ కీయ రంగంలోకి దిగిన కొత్తల్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన తమిళ సినీ ప్రముఖుల్లో దర్శకుడు చేరన్ ఒకరు. అసెంబ్లీ ఎన్ని కల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో చేరన్ ఇప్పుడు మాట మార్చారు. గతంలో విజయ్‌ను విమర్శించినందుకు చింతిస్తున్నాను అంటూ ఓ పోస్ట్ చేశారు. ‘సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ప్రజల నుంచి అఖండ మద్దతు పొంది, తన తొలి ఎన్నికల్లోనే 108 సీట్లు గెలుచుకున్న విజయ్‌కు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా. మీ విజయం పట్ల నా ఆనందమే రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న స్వేచ్ఛా వాయువు. ఎన్నో ఏళ్ళుగా మమ్మల్ని పట్టిపీడించిన పార్టీల కోరల నుంచి నన్ను, ప్రజలను విడిపించి, వారికి ఒక ఊరటనిచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అదే మా అందరి కోరిక కూడా. మీ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి భవిష్యత్ తరాల అవసరాలను తీరుస్తుందని ఆశిస్తున్నాను. ఎన్నికలకు ముందు మీపై నేను చేసిన విమర్శలకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నా’ అని పేర్కొన్నారు.