సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

టాక్సిక్: సాంగ్ బావుంది.. వీడియో కూడా ఉంటే ఇంకా బావుండేది

ABN, Publish Date - Mar 02 , 2026 | 03:10 PM

కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయారు యశ్ (Yash). ఇక ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొన్న యశ్ ఈ ఏడాది టాక్సిక్ (Toxic) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Toxic

కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయారు యశ్ (Yash). ఇక ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొన్న యశ్ ఈ ఏడాది టాక్సిక్ (Toxic) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గీతూ మోహన్ దాస్ టాక్సిక్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్, మోన్స్టార్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టాక్సిక్ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా టాక్సిక్ చిత్రంలోని మొదటి ఆడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తబాహీ తబాహీ అంటూ సాగే ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకొంటుంది. యశ్, కియారా అద్వానీల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ లా కనిపిస్తోంది. బీచ్ ఒడ్డున కియారా ఒడిలో పడుకొని సేదతీరుతున్న యశ్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రేమికుల మధ్య ఉండే గాఢమైన భావాలను తెలుపుతూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ను రాసినట్లు తెలుస్తోంది.

ఇక ఆ లిరిక్స్ ను తన బేస్ వాయిస్ తో ఆలపించి సాంగ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళారు సింగర్ విశాల్ మిశ్రా. ఆ లిరిక్స్ కి తగ్గట్లే విజువల్స్ కూడా ఉన్నట్లు సమాచారం. రొమాంటిక్ సీన్స్ ఉండడంతోనే వాటిని రివీల్ చేయకుండా కేవలం ఆడియో సాంగ్ ని మాత్రమే రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ విన్న అభిమానులు సాంగ్ చాలా బావుంది.. విజువల్స్ కూడా ఉంటే రిబ్కా బావుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 19 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో యశ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Mar 02 , 2026 | 03:26 PM