సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దింది జ్యోతికే.. భార్యపై సూర్య ఎమోషనల్ కామెంట్స్

ABN, Publish Date - Nov 02 , 2026 | 02:02 PM

హీరో సూర్య తన భార్య జ్యోతికపై ప్రశంసలు కురిపించారు. జీవితంలో ఎన్నో తప్పులు చేసిన తనను సరిదిద్ది ముందుకు నడిపించిందని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Suriya

సూర్య (Suriya) హీరోగా జీతు మాధవన్‌ (Jithu Madhavan) డైరక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సీన్‌’ (Scene). నజ్రియా నజీమ్ (Nazriya Nazim) నాయిక. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్‌, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై రూపొందుతోంది. తాజాగా ‘సీన్‌’ తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ‘ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. ‘కెరీర్‌ పరంగా పీక్‌లో ఉన్నప్పుడు ఉద్యోగానికి రిజైన్‌ చేసి ఏం చేస్తావు’ అనే ప్రశ్నకు.. ‘పాలిటిక్స్‌లోకి వెళ్లిపోతా’ అని సూర్య సమాధానం ఇవ్వడం ట్రైలర్‌లో హైలైట్‌ అయింది. మూవీలో యాక్షన్‌, కామెడీ, థ్రిల్‌ అంశాలు మెప్పిస్తాయి. ఈ నెల 6న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని మేకర్స్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఎన్వీఆర్‌ సినిమా విడుదల చేస్తోంది.

అయితే.. సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ను పురస్కరించుకుని ఇటీవ‌ల ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా సూర్య ప్రసంగిస్తూ ఎమోష‌న‌ల్ వ్యాఖ్య‌లు చేశారు. జీవితంలో అనేక తప్పులు చేశానని, వాటినన్నింటినీ సరిదిద్ది పైకి లేపి ముందుకు నడిపిస్తున్న వ్యక్తి తన భార్య జ్యోతిక (Jyothika) అని హీరో సూర్య ప్రశంసల వర్షం కురిపించారు. 'నా తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఎవరో నేను నిర్ణయించలేదు. నేను ఆ ఇంట్లో పుట్టాను. వారితో కలిసి పెరిగాను, కానీ నా భార్య నాకు మార్గనిర్దేశం చేస్తున్నది. నేను ఎన్నో తప్పులు చేసి కిందపడ్డా ఆమె వాటిని సరిదిద్ధింది. నేను బాగా రాణిస్తున్నపుడు కూడా జో ఎపుడూ నా చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తారు. ఉత్తమ భార్యగా, ఉత్తమ తల్లిగా, ఉత్తమ స్నేహితురాలిగా నన్ను తీర్చిదిద్దనవన్నీ నా భార్యవల్లే జరిగాయి. ఈ దీపావళికి 'రామాయణం', 'మూక్కుత్తి అమ్మన్-2'తో పాటు మా చిత్రం వస్తోంది. మా సినిమా కోసం ధనుష్ తన చిత్రం 'ఓం' విడుదలను వాయిదా వేసుకున్నాందుకు సూర్య ధనుష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఆ తర్వాత సూర్య సోదరుడు కార్తి (Karthi) మాట్లాడుతూ.. 'మా అన్నయ్య వదినల పునర్వివాహ వేడుక జరిగినపుడు నాకు, నా భార్యకు గొడవ జరిగింది. అక్కడున్న చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎలా ప్రేమించుకుంటున్నారో చూడండి అంటూ అక్కడకు వచ్చిన వారంతా కామెంట్స్ చేశారు. ఈ వివాహ వేడుకకు వచ్చిన పురుషుల్లో చాలా మందికి ఇంటికి వెళ్ళిన తర్వాత తిండి కూడా దొరడం లేదు' అని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, 'సీన్' మూవీలో సూర్య, నజ్రియా నజీం , నస్లెన్ (Naslen), ఆనంద్ రాజ్, రాజ్ ప్రిరయన్ నటించగా, జ్యోతిక - సూర్య సంయుక్తంగా నిర్మించారు.

Updated Date - Nov 02 , 2026 | 02:57 PM