సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Surya vs Vishal: సూర్యకు.. సవాల్ విసురుతున్న విశాల్

ABN, Publish Date - Aug 06 , 2026 | 03:18 PM

ఆగస్టు 14న సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్', విశాల్ 'మకుటం' ఒకే రోజు విడుదల కానున్నాయి. ఇండిపెండెన్స్ వీక్‌లో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

vishal suriya

ఇండిపెండెన్స్ డే (Independence Day Box Office) వీక్‌కు బాక్సాఫీస్ పోటీ రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. ఇప్పటికే సూర్య (Surya) నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath & Sons) సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పుడు విశాల్ (Vishal) కూడా తన కొత్త చిత్రం మకుటం (Makutam)తో అదే తేదీన బరిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యాడు. దీంతో ఆగస్టు 14న థియేటర్లలో ఆసక్తికరమైన పోటీ కనిపించనుండ‌గా అంద‌రి దృష్టి ఇప్పుడు ఈ సినిమాల‌పైనే ఉంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే తేదీకి విశాల్ దర్శకత్వం ఫ‌స్ట్ టైం పూర్తి స్థాయిలో ద‌ర్శ‌కుడిగా మారి మ‌రి హీరోగా నటించిన‌ 'మకుటం' కూడా విడుదల కానుంది. అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి వస్తున్న 99వ ప్రాజెక్ట్ కావ‌డం గ‌మ‌నార్హం. దివంగత ఆర్.బి. చౌదరి నిర్మాణంలో ప్రారంభమైన ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన‌ పోస్టర్లు, టీజర్లే సైతం ప్రేక్ష‌కుల్లో మంచి క్యూరియాసిటీ పెంచింది.

అయితే.. ఈ రెండు చిత్రాలు తమిళంలో రూపొందినా, తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్‌లతో విడుదల కానుండటం విశేషం. సూర్య, విశాల్ ఇద్దరికీ తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండటంతో ఈ పోటీపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఇదిలా ఉంటే, అదే వారంలో మూడు చిన్న‌స్ట్రెయిట్ తెలుగు సినిమాలు సైతం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న పళ్ల‌బరుసు (Pallaburusu), ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన‌ అగధ (Agadha), ఆగస్టు 15న హుషార్ పిట్టలు (Husharu Pittalu) వంటి సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈసారి స్వాతంత్య్ర‌ దినోత్సవం శుక్రవారం రావడం, మూడు రోజుల లాంగ్ వీకెండ్ కలిసి రావడం నిర్మాతలకు బాగానే క‌లిసొచ్చే అవకాశంగా ఉంది.

'మకుటం' విశాల్ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. తొలిసారి దర్శకుడిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు, సినిమాలో భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం కూడా సినిమాపై అంచనాలు పెంచుతోంది.మరోవైపు 'విశ్వనాథ్ అండ్ సన్స్'పై కూడా భారీ క్రేజ్ ఉంది. 'సార్', 'లక్కీ భాస్కర్' విజయాల తర్వాత వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన సినిమా కావడం, సూర్య నుంచి మరో భారీ చిత్రం రావడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. మొత్తానికి ఆగస్టు 14న విడుదల కానున్న చిత్రాల్లో సూర్య, విశాల్ సినిమాల మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఈ బాక్సాఫీస్ సమరంలో ప్రేక్షకుల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో చూడాలి.

Updated Date - Aug 06 , 2026 | 03:36 PM