సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నస్లెన్‌కు సూర్య సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ధర తెలిస్తే షాకే!

ABN, Publish Date - Nov 19 , 2026 | 03:47 PM

సీన్‌ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించిన నస్లెన్‌కు హీరో సూర్య ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు.

Suriya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తన సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించిన యువ నటుడికి ఖరీదైన బహుమతిని అందించి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? సూర్య ఇచ్చిన గిఫ్ట్‌ విలువ ఎంతంటే..

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం సీన్‌ (Scene) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.252 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇంకా విజ‌య‌వంతంగా దూసుకెళుతోంది. ఈ విజయంతో సూర్య ఈ ఏడాది వరుసగా మూడు హిట్లు అందుకున్న హీరోగా అరుదైన రికార్డును సైతం చేసుకున్నాడు.

కాగా.. ఈ సినిమాలో మలయాళ చిత్రం 'ప్రేమలు'తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు నస్లెన్ (Naslen) విలన్‌గా నటించిన విష‌యం తెలిసిందే. ఈశ్వరన్ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్ర‌తి నాయ‌కుడి పాత్రలో హీరోకు స‌రైన ప్ర‌త్య‌ర్థిగా నస్లెన్ చూపించిన నటనకు మంచి స్పందన లభించింది. మరోవైపు, నస్లెన్‌కు ఈ సినిమా ద్వారా కోలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు లభించింది.

ఈ నేపథ్యంలో నస్లెన్‌కు హీరో సూర్య ఓ ఖరీదైన బహుమతిని అందించారట. ఈ విషయాన్ని నస్లెన్ స్వయంగా వెల్లడించారు. సూర్య తనకు కార్టియర్ శాంటోస్ (Cartier Santos) కంపెనీకి చెందిన లగ్జరీ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలిపారు. ఈ వాచ్ ధర మార్కెట్ అంచనాల ప్రకారం సుమారు రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది.

తనతో కలిసి నటించిన న‌స్లైన్‌కు సూర్య ఇంత విలువైన బహుమతిని అందించడంపై సినీ వర్గాల్లో ప‌లుర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. సినిమా అంత పెద్ద స‌క్సెస్ అయితే జ‌స్ట్ వాచ్ తోనే స‌రిపెడ‌తారా అంటు కామెంట్లు చేస్తున్నారు. ఇత‌ర నిర్మాణ సంస్థ‌లు త‌మ సినిమాలు విజ‌యం సాదిస్తే అంత విలువైన‌ పెద్ద పెద్ద ల‌గ్జ‌రీ కార్లు ఇస్తుంటే మీరేంటి ఇలా చేశారు అంటూ పోస్టులు పెడుతున్నారు.

Updated Date - Nov 19 , 2026 | 04:18 PM