సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'ళ‌గరం'.. సూర్య మరో ప్రొడక్షన్ హౌస్

ABN, Publish Date - Oct 27 , 2026 | 12:12 PM

ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థ ఉన్నా.. సూర్య మరో బ్యానర్‌ను ఎందుకు ప్రారంభించారు?

Suriya

ఇప్పటికే సినీ నిర్మాణ సంస్థ ఉండగా మరో నిర్మాణ సంస్థను ప్రారంభించడానికి గల కారణం కొత్త టాలెంట్‌ను వెలికి తీసేందుకేనని హీరో సూర్య (Suriya) వివరించారు. సినిమా అవకాశాల కోసం ఎంతో మంది యువ ప్రతిభావంతులైన కళాకారులు వేచి చూస్తున్నారని, అలాంటి వారికి అవకాశం ఇవ్వడం కోసమే ళ‌గరం స్టూడియోస్‌ (Zhagaram (Lagaram) Studios) పేరుతో కంపెనీ ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు.

మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ (jeethu madhavan) దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'సీన్' దీపావళి సందర్భంగా నవంబరు 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ఆడియో రిలీజ్ వేడుక ఇటీవ‌ల‌ దుబాయ్ వేదికగా జరిగింది. ఇందులో సూర్య ప్రసంగిస్తూ, 'అగరం' చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20 యేళ్ళుగా సేవలందిస్తున్నామని, సినిమాలో కూడా ఇలాంటి సంస్థ ఒకటి ఉండాలని భావించి '2డి ఎంటర్టైన్మెంట్ (2D Entertainment) ను స్థాపించాం. ఈ బ్యానరుపై కుటుంబ సభ్యులంతా కూర్చొని చూసేలా వాణిజ్యపరంగా విజయం సాధించే నాణ్యమైన చిత్రాలను నిర్మిస్తున్నాం.

అయితే, ఇపుడు 'ళ‌గరం' పేరుతో మరో ప్రొడక్షన్ హౌస్ ఎందుకు స్థాపించారంటూ అనేక మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఇండస్ట్రీలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అనేక మంది యువ కళాకారులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారిని పోత్రహించేందుకు ఈ సంస్థను స్థాపించాం' అని సూర్య వివరించారు. కాగా, 'సీన్' చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్, ళ‌గరం స్టూడియోస్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక దంపతులు సంయుక్తంగా నిర్మించారు.

Updated Date - Oct 27 , 2026 | 12:12 PM