వీరభద్రుడు.. వచ్చేస్తున్నాడు
ABN, Publish Date - May 06 , 2026 | 06:27 AM
తమిళ కథానాయకుడు సూర్య (Suriya) పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటించిన చిత్రం ‘వీరభద్రుడు’.
తమిళ కథానాయకుడు సూర్య (Suriya) పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటించిన చిత్రం ‘వీరభద్రుడు’ (Veera Bhadrudu). ఆర్‌జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించారు. త్రిష కథానాయిక.
అయితే.. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.
రక్తం నిండిన తెల్లచొక్కాతో బైక్‌పై సీరియ్‌సగా వస్తున్న సూర్య లుక్ ఆకట్టుకుంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్: ఆర్ కళైవానన్, సినిమాటోగ్రఫీ: జి.కె విష్ణు, సంగీతం: సాయి అభ్యంకర్.