సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Karuppu Trailer: అదిరిపోయిన కరుప్పు ట్రైలర్.. త్రిషనే హైలైట్

ABN, Publish Date - May 10 , 2026 | 08:50 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఒక చాలాకాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కంగువ, రెట్రో సినిమాలపై సూర్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

suriya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఒక చాలాకాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కంగువ, రెట్రో సినిమాలపై సూర్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ, రెండు సినిమాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం సూర్య ఆశలన్నీ కరుప్పు మీదనే పెట్టుకున్నాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం కరుప్పు (Karuppu). ఈ చిత్రంలో సూర్య సరసన త్రిష కృష్ణన్ నటించింది. ఇక తెలుగులో వీరభద్రుడు అనే పేరుతో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా కరుప్పు ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కోర్టు చుట్టూనే ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. బికె (ఆర్జే బాలాజీ) ఒక ఫేమస్ లాయర్. సామాన్య ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి మోసం చేస్తుంటాడు. అలా ఒక అమ్మాయి కేసులో మోసం చేయగా.. కరుప్పు (సూర్య) ఆ కేసును వాదిస్తాడు. కరుప్పు కేవలం న్యాయం చేయడమే కాకుండా బికెకి బుద్దిచెప్పాలనుకుంటాడు. దీంతో బికె.. కరుప్పుపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. మరి చివరకు కరుప్పుపై బికె పగ తీర్చుకున్నాడా.. ? నిజంగానే కరుప్పు.. పైనుంచి దిగివచ్చిన కరుప్పన్ స్వామినా.. ? అతనికి, ప్రీతి( త్రిష) కి ఉన్న సంబంధం ఏంటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


సినిమాలో గ్రామీణ నేపథ్యం, ప్రతీకారం, న్యాయం వంటి అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ ప్రారంభం నుంచే డార్క్ టోన్‌తో కథను ఆసక్తికరంగా చూపించారు. హీరో పవర్‌ఫుల్ ఎంట్రీ, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలవగా.. త్రిష మరో హైలైట్ గా నిలిచింది. మే 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. మరి ఈ సినిమా సూర్య - త్రిషకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Updated Date - May 10 , 2026 | 09:34 PM