సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Karuppu: రూ.300 కోట్ల క్లబ్‌లో 'కరుప్పు'

ABN, Publish Date - May 31 , 2026 | 09:46 PM

సూర్య హీరోగా నటించిన కరుప్పు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్ల మేరకు వసూళ్లు సాధించినట్టు ఆ చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

Karuppu

సూర్య (suriya) హీరోగా నటించిన 'కరుప్పు (karuppu) తెలుగులో వీర‌భ‌ద్రుడు (Veerabhadrudu) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ.300 కోట్ల మేరకు వసూళ్లు సాధించినట్టు ఆ చిత్ర నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ అధికారి కంగా వెల్లడించింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష ( trisha krishnan) హీరోయిన్. ఆర్జే బాలాజీ (rj balaji) ప్రతి నాయకుడు. ఇంద్రన్స్ ముఖ్య, పాత్రను పోషించారు.

ఈ నెల 15న విడుదలైంది. తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వాణిజ్యపరంగా సూపర్ హిట్‌గా నిలిచింది. ఫలితంగా తొలి రోజు నుంచే భారీ కలెక్షన్లు రాబడుతోంది. తొలి మూడు రోజుల్లో రూ.147 కోట్లు వసూలు చేయగా, రెండో వారాంతానికి రూ.193.50 కోట్లు రాబట్టింది. ఈ కలెక్షన్లు శుక్రవారానికి రూ.300 కోట్లకు చేరుకున్నట్టు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. బక్రీద్ పండుగ రోజు కూడా రూ.6 కోట్లు వసూలు చేసిందని నిర్మాణ సంస్థ తెలిపింది. కాగా, సూర్యకు దాదాపు దశాబ్దం కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్‌గా 'కరుప్పు' నిలిచిన విషయం తెల్సిందే.

Updated Date - May 31 , 2026 | 09:46 PM