సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

త్వరలో రజనీకాంత్ బయోపిక్..

ABN, Publish Date - Jul 26 , 2026 | 05:53 PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నటుడు రజనీకాంత్ (Rajinikanth) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Superstar Rajinikanth

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నటుడు రజనీకాంత్ (Rajinikanth) ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన జీవిత ప్రయాణాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన స్వయంగా తన ఆత్మకథ రాసే పనిలో నిమగ్నమయ్యారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి భారతీయ సినిమాలో అగ్రకథానాయకుడిగా ఎదిగిన క్రమం, జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, సవాళ్లతో పాటు తన వ్యక్తిగత అనుభవాలన్నింటినీ ఈ పుస్తకంలో పొందుపరచనున్నట్లు సమాచారం.


ఇక కేవలం పుస్తకం రాయడమే కాకుండా, ఈ ఆత్మకథను ఒక భారీ బయోపిక్ సినిమాగా తెరకెక్కించే దిశగా కూడా రజనీకాంత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనపై ఆయన ఇప్పటికే తనకు అత్యంత సన్నిహితులైన ప్రముఖులతో చర్చలు జరిపారని సమాచారం. అయితే దీనిపై రజనీకాంత్ బృందం, పిఆర్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఈ వార్త తెలియడంతో రజనీ పాత్రలో ఏ హీరో నటిస్తే బావుంటుంది.. అని చర్చలు మొదలుపెడుతున్నారు.


ప్రస్తుతం రజనీకాంత్ వరుస భారీ సినిమాలతో పూర్తి బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ జైలర్ 2 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనితో పాటు ధర్మన్ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు కాకుండా కమల్ హాసన్ బ్యానర్ లో ఒక సినిమా.. కమల్ తో కలిసి మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ఒకవైపు వరుస సినిమాలతో థియేటర్లను ఊపేస్తూనే, మరోవైపు ఆత్మకథ, బయోపిక్ వార్తలతో రజనీకాంత్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Updated Date - Jul 26 , 2026 | 05:58 PM