Sam C.S: నాకు.. అది తప్పితే ఏదీ గుర్తులేదు
ABN, Publish Date - Sep 11 , 2026 | 09:29 AM
నేను సంగీతం సమకూర్చిన ప్రతి ప్రాజెక్టు విజయవంతం కాలేదని, కానీ, ప్రతి ప్రాజెక్టు ఏదో ఒక పాఠం నేర్పిందని ప్రముఖ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ (Sam C. S.) అన్నారు.
నేను సంగీతం సమకూర్చిన ప్రతి ప్రాజెక్టు విజయవంతం కాలేదని, కానీ, ప్రతి ప్రాజెక్టు ఏదో ఒక పాఠం నేర్పిందని ప్రముఖ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ (Sam C. S.) అన్నారు. సంగీత దర్శకుడిగా సర్దార్-2 (sardar 2) ఆయనకు వందో చిత్రం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'ఇప్పటికే వంద చిత్రాలు పూర్తి చేశాను. మరో వంద చిత్రాలు చేస్తాను. నాకు సినిమాల సంఖ్య ముఖ్యం కాదు. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి సంగీతం అందించడమే ముఖ్యం. నిజం చెప్పాలంటే నాకు నేను సంగీతం సమకూర్చిన తొలి చిత్రమే గుర్తుంది. నా 35వ చిత్రం లేదా 50వ చిత్రం ఏదీ గుర్తు లేదు.
నా ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం నేపథ్య సంగీతం అందించినవే. దీనికి ఉదాహరణే 'ఖైదీ', 'వనంగాన్' సినిమాలు. నేను ఎక్కువగా కొత్త దర్శకులతో కలిసి పనిచేశాను. వారు సంప్రదాయానికి భిన్నంగా వినూత్నమైన ఆలోచనలతో వస్తారు. సంగీతంలో నేను చేసిన ప్రతి ప్రయోగం సక్సెస్ కాలేదు. కానీ, ఏదో ఒక విషయాన్ని నేర్పింది. 'వైఫల్యం నేర్పినంతగా మరేదీ నేర్పించలేదు' అనే సూక్తిని నేను బాగా ఇష్ట పడతాను. ఆ వైఫల్యాలు నన్ను ఉత్తమ సంగీతకళాకారుడిగా తీర్చిదిద్దడానికి ఉయోగపడ్డాయి. సంగీతం అంటే నాకు ప్రాణం. నిద్రపోయేటపుడు మినహా మిగిలిన సమయాన్నంతా సంగీతానికే కేటాయిస్తాను' అని పేర్కొన్నారు.