Mohan Lal: విష్ణు మోహన్ దర్శకత్వంలో మోహన్ లాల్ భారీ చిత్రం
ABN, Publish Date - Jan 26 , 2026 | 05:26 PM
శ్రీ గోకులం బ్యానర్ లో మోహన్ లాల్ కొత్త సినిమా చేస్తున్నారు. దీనికి విష్ణుమోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ గోకులంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇదే కావడం విశేషం.
మోహన్‌లాల్ (Mohanlal) కథానాయకుడిగా శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై నిర్మాత గోకులం గోపాలన్ నిర్మిస్తున్న కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న తన తొలి చిత్రం ‘మెప్పాడియన్’తో బలమైన ముద్ర వేసిన విష్ణు మోహన్ ఈ చిత్రానికి కథ అందించి, దర్శకత్వం వహించనున్నారు. భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఎల్367, శ్రీ గోకులం మూవీస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీ. ఈ ప్రాజెక్ట్‌కు బైజు గోపాలన్, వి సి ప్రవీణ్ సహ నిర్మాతలుగా వ్యవహరించనుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
భారీ కాన్వాస్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విదేశీ, హిందీ సినీ ప్రముఖులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు కలిసి పనిచేయనున్నారు. చిత్ర బృందం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు. ప్రస్తుతం శ్రీ గోకులం మూవీస్ నిర్మాణంలో సురేష్ గోపి నటించిన ఒట్టకొంబన్, జయరామ్-కాళిదాస్ జయరామ్ ఆశకల్ ఆయిరం, జయసూర్య నటించిన కథనార్, నివిన్ పౌలీ, బి ఉన్నికృష్ణన్ చిత్రం, ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన కిల్లర్ వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ జాబితాలో ఎల్367 కూడా చేరడంతో ఈ బ్యానర్ మలయాళ సినిమా రంగంలో ఒక శక్తివంతమైన నిర్మాణ సంస్థగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది.