కేరళలో.. ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
ABN, Publish Date - Apr 02 , 2026 | 06:54 AM
ప్రఖ్యాత తెలుగు సినీ సంగీత దిగ్గజం, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Bala Subrahmanyam)కు గొప్ప గౌరవం దక్కింది.
ప్రఖ్యాత తెలుగు సినీ సంగీత దిగ్గజం, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Bala Subrahmanyam)కు గొప్ప గౌరవం దక్కింది. కేరళ (Kerala)లోని పాలక్కాడ్ (Palakkad) వీటీ భట్ట తిరిప్పాడ్ కల్చరల్ సెంటర్‌లో 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు.
సమమ్ (సింగర్స్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీస్), పాలక్కాడ్ స్వరాలయ సంస్థ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. కేరళ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి సహకరించింది.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణి (MM Keeravaani) , గాయని కేఎస్ చిత్ర (K S Chithra) ఆధ్యర్యంలో ‘సంగీత మేఘం’ పేరిట బాలు సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మలయాళ సినీ ప్రముఖులతో పాటూ గాయకులు హరిహరన్ (Hari Haran), మను తదితరులు పాల్గొని బాలు విగ్రహానికి ఘన నివాళులర్పించారు.