సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Soundarya Rajinikanth: కమల్‌, రజనీ సినిమా.. సౌందర్య ఏం చెప్పారంటే..

ABN, Publish Date - Jan 29 , 2026 | 10:31 AM

‘నాన్న రజనీకాంత్‌, విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ను ఒకే తెరపై చూడాలనే ఆసక్తి నాకూ ఉంది’ అని   సౌందర్య రజనీకాంత్‌ అన్నారు.


‘నాన్న రజనీకాంత్‌(Rajinikanth), విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ను (Kamal Haasan)ఒకే తెరపై చూడాలనే ఆసక్తి నాకూ ఉంది’ అని   సౌందర్య రజనీకాంత్‌ (Soundarya Rajinikanth) అన్నారు. ఆ చిత్రం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషాన్‌ జీవింత్‌ హీరోగా తెరకెక్కిన ‘విత్‌ లవ్‌’ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నిర్మాతల్లో ఒకరైన సౌందర్య రజనీకాంత్‌ కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడారు. రజనీకాంత్‌; కమల్‌హాసన్‌ కలిసి నటించనున్న సినిమా గురించి దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ ఇప్పటికే మాట్లాడారు. అయితే ఇతర విషయాలేమీ ఆయన చెప్పలేదు. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం ప్రేక్షకులతో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.

అయితే రజనీకాంత్‌ 173వ చిత్రం కమల్‌హాసన్‌ నిర్మాణ సంస్థలో తెరకెక్కుతుంది. మొదటి ఈ చిత్రానికి సుందర్‌ సి ద,,ర్శకుడని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడీ చిత్రానికి శిబి చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. 2027 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - Jan 29 , 2026 | 10:32 AM