Soundarya Rajinikanth: రజనీకాంత్.. ఆటో బయోగ్రఫీ రాస్తున్నారు! ప్రపంచవ్యాప్తంగా.. సంచలనం సృష్టిస్తుంది
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:47 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవితంపై ఆటో బయోగ్రఫీ రాస్తున్నారని కుమార్తె సౌందర్య రజనీకాంత్ వెల్లడించారు. విడుదలైన వెంటనే సంచలనం సృష్టిస్తుందన్నారు.
రజనీకాంత్ (Rajinikanth) జీవితంపై ఓ పుస్తకం తయారవుతోందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై సూపర్‌స్టార్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ (Soundarya Rajinikanth) ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. తన తండ్రి ఆటో బయోగ్రఫీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఈ పుస్తకాన్ని రాస్తున్నారని తెలిపారు.
ఈ పుస్తకం విడుదలైన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని తెలిపారు. ఇందులో సాధారణ బస్ కండక్టర్‌గా జీవితం ప్రారంభించిన ఒక వ్యక్తి, తన స్వశక్తితో సూపర్‌స్టార్‌గా ఎదిగిన క్రమాన్ని హృద్యంగా ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. రజనీకాంత్ జీవితం గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలను ఈ పుస్తకం తెలియజేయనుందని పేర్కొన్నారు.
‘కొచ్చాడయాన్’, ‘వీఐపీ 2’ చిత్రాలను తెరకెక్కించారు సౌందర్య. తాజాగా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా నటించిన ‘విత్ లవ్’ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం విడుదలవుతోంది. ‘విత్ లవ్’ ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ పుస్తకం గురించి అప్డేట్ ఇచ్చారు సౌందర్య.
సౌందర్య రజనీకాంత్.