సుహాస్.. ‘మండాడి’ షూటింగ్ పూర్తి
ABN, Publish Date - Apr 27 , 2026 | 07:43 AM
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మండాడి.
సుహాస్ (Suhas), సూరి (Soori) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మండాడి (Mandaadi). తమిళ , తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి మది మారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. మహిమా నంబియార్ కథానాయిక. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఎంతో సుదీర్ఘమైన, సవాలుతో కూడిన షెడ్యూల్‌తో సినిమా మాటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలిపారు.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్లుక్, టైటిల్ పోస్టర్లతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. కథ అంతా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో సుహాస్ ఓ విభిన్నమైన పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా ఆయన వంద రోజుల్ని కేటా యించారు. వంద రోజుల కాల్ షీట్ ఇవ్వడం చూస్తుంటే ఆయనకు ఈ మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. అలాగే సూరి, సుహాన్లు పాత్రలకు తగ్గట్టుగా తమ శరీరాకృతిని, లుక్‌ను మార్చుకున్నారు.