సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సూరి హీరోగా.. మైత్రీ మూవీస్ సినిమా

ABN, Publish Date - Mar 25 , 2026 | 06:51 AM

త‌మిళ హ‌స్య న‌టుడు, ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న స్టార్ క‌మెడియ‌న్ సూరి (Soori) క‌థానాయ‌కుడిగా త‌మిళ , తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో ఓ సినిమా తెర‌కెక్కబోతోంది.

soori

త‌మిళ హ‌స్య న‌టుడు, ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న స్టార్ క‌మెడియ‌న్ సూరి (Soori) క‌థానాయ‌కుడిగా త‌మిళ , తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో ఓ సినిమా తెర‌కెక్కబోతోంది. ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) నవీన్ యెర్నేని (Naveen Yerneni), వై. రవి శంకర్ (Y. Ravi Shankar) త‌మిళంలో త‌మ మూడ‌వ ప్ర‌య‌త్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం. రెండేళ్ళ క్రితం శివ కార్తికేయ‌న్‌తో అయ‌లాన్ వంటి సైన్స్ ఫిక్షన్‌ క‌థ‌తో మంచి హిట్ అందుకున్న ఆర్. ర‌వి కుమార్ (Ravikumar R) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ విష‌యాల‌ను తెలుపుతూ మేక‌ర్స్ తాజాగా ఓ పోస్ట‌ర్ చేసి అధికారికంగా ప్ర‌క‌టించారు.

మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇన్‌టెన్స్‌గా, విజువల్‌గా ఆకట్టుకుంది. పోస్టర్‌లో హీరో వెనుక నుంచి కనిపిస్తూ, మురికిగా ఉన్న వరద నీటిలో నడుము వరకు నిలబడి ఉంటాడు. అతని ప్రతిబింబం నీటిలో కనిపిస్తూ ఒక సర్రియల్‌ ఫీల్ ఇస్తోంది. కుడిచేతిలో ఆయుధం పట్టుకుని ఉండటం ప్రమాదం, బతుకుబాట మధ్య పోరాటాన్ని సూచిస్తోంది. చుట్టూ పగిలిపోయిన సామాన్లు, చెదరిపోయిన వస్తువులు, తలకిందులైన గ్యాస్ సిలిండర్.. ఇవన్నీ విపత్తు తర్వాతి పరిస్థితిని చూపిస్తున్నాయి. ముందున్న తలుపు నుంచి వచ్చే ఎర్రటి వెలుతురు ఒక ఇంటెన్స్ వాతావరణాన్ని సృష్టిస్తోంది.

మైత్రీ వంటి సంస్థ‌లో హీరోగా న‌టించ‌డం గ‌ర్వంగా ఉంద‌ని పేర్కొంటూ సూరి నిర్మాత‌ల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇదిలాఉంటే.. సినిమాను త్వ‌ర‌లోనే ఆరంభించి ఈ ఏడాది చివ‌రి నాటికి థియేట‌ర్లకు తీసుకు వ‌చ్చేందుకు నిర్మాత‌లు ఫ్లాన్ చేస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేయ‌నున్నారు.

Updated Date - Mar 25 , 2026 | 08:50 AM