సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sivakarthikeyan: పరాశక్తి’కి వీడిన కోర్టు చిక్కులు

ABN, Publish Date - Jan 03 , 2026 | 11:07 AM

‘పరాశక్తి’ (Para Sakti) మూవీకి న్యాయపరమైన చిక్కులు వీడాయి. ఈ చిత్రం విడుదలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు తోసిపుచ్చుతూ, విడుదలకు పచ్చజెండా ఊపింది.

సుధా కొంగరా (Sudha Kongara) దర్శకత్వంలో శివకార్తికేయన్‌(Siva karthikeya), రవి మోహన్‌, అధర్వ మురళి, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించిన ‘పరాశక్తి’ (Para Sakti) మూవీకి న్యాయపరమైన చిక్కులు వీడాయి. ఈ చిత్రం విడుదలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు తోసిపుచ్చుతూ, విడుదలకు పచ్చజెండా ఊపింది. డ్వాన్‌ పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 10న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకానుంది. అయితే, తన ‘సెయమ్మొళి’ అనే కథను చోరీ చేసి ఈ మూవీని తెరకెక్కించారని, అందువల్ల విడుదలపై స్టే విధించాలని కోరుతూ అసిస్టెంట్‌ దర్శకుడు రాజేంద్రన్‌ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. న్యాయమూర్తి సెంథిల్‌ కుమార్‌ సమక్షంలో ఈ కేసు విచారణ వచ్చింది.

‘1965లో జరిగిన హిందీ వ్యతిరేక పోరాటం ఆధారంగా ‘సెమ్మొళి’ అనే కథ రాసి  2010 లో దక్షిణ భారత సినీ రచయిత సంఘంలో రిజిస్టర్‌ చేశారని, ఈ చిత్రంలో కథా రచయిత సుధా కొంగరా అనే టైటిల్‌ కార్డు లేకుండా, అలాగే, సినిమా విడుదలపై స్టే విధించాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. దర్శకురాలు సుధా కొంగరా, నిర్మాణ సంస్థ తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాదులు పీఎస్‌ రామన్‌, అరవింద్‌ పాండ్యన్‌లు తమ వాదనలు వినిపించారు.

న్యాయమూర్తి సెంథిల్‌ కుమార్‌ ఇరు వర్గాల వాదనలు ఆలకించి ‘పరాశక్తి’ సినిమా 2024లో ప్రకటించగా, పిటిషనర్‌2025 డిసెంబరు వరకు ఎలాం టి పిటిషన్‌ దాఖలు చేయలేదంటూ, మూవీ విడుదలపై స్టే విధించేందుకు నిరాకరిస్తూ, పిటిషన్‌ను తోసిపుచ్చారు. ‘సెమ్మొళి’, ‘పరాశక్తి’ కథలను పరిశీలిం చి నివేదిక సమర్పించాలని గతం లో ఆదేశించామనీ, కానీ, దక్షిణ భారత సినీ రచయితల సం ఘం నుంచి స్పందన లేదని గుర్తు చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. 

Updated Date - Jan 03 , 2026 | 11:08 AM