తాయ్ కిళవి' దర్శకుడికి.. శివ కార్తీకేయన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్
ABN, Publish Date - Jul 09 , 2026 | 10:41 AM
ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లకు వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం తాయ్ కిళవి.
ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లకు వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం తాయ్ కిళవి (Thaai Kizhavi). శివ కుమార్ మురుగేశన్ (Sivakumar Murugesan) దర్శకుడిగా పరిచయమయ్యాడు. సీనియర్ నటి రాధిక (Radikaa) ప్రధాన పాత్రలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. స్టార్ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) నిర్మాణంలో కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వసూలు చేసి తమిళనాట రికార్డులు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో ఇటీవల తాయ్ కిళవి చిత్ర శతదినోత్సవ వేడుకలను చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు శివకుమార్‌కు నిర్మాత శివ కార్తికేయన్, సహ నిర్మాత సుధన్ సుందరం ఊహించని బహుమతి ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన వేడుకల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.