Sivakarthikeyan: మద్యం, సిగరెట్ సీన్లకు నేను దూరం
ABN, Publish Date - Oct 28 , 2026 | 02:47 PM
సినిమాలో మద్యం తాగే సీన్ ఉంటే నిజంగా మందు తాగనని, జీలకర్ర నీళ్లే తీసుకుంటానని హీరో శివకార్తికేయన్ తెలిపారు.
తాను నటించే చిత్రాల్లో మద్యపానం, ధూమపానం వంటి సన్నివేశాలు ఉండవని, ఒక వేళ కథ డిమాండ్ మేరకు మద్యం తాగాల్సి వస్తే జీలకర్ర నీరు తాగుతానని హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) అన్నారు. తాజాగా ఆయన శివకుమార్ మురుగేశన్ (Sivakumar Murugesan) దర్శకత్వంలో రూపొందుతున్న సెయాన్ (Seyon) చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మదురైలో శరవేగంగా జరుపుకుటుంది. తమిళులు ఆరాధ్య దైవమైన మురుగన్ దేవుడి బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ నేపథ్యంలో హీరో శివకార్తికేయన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'సినిమాల్లో మద్యం, ధూమపానం వంటి సన్నివేశాల్లో నటించనందుకు ప్రజలు నన్ను అభినందిస్తుంటారు. కథకు అవసరమైతేనే అలాంటి సన్నివేశాల్లో నటిస్తానని ముందుగానే దర్శకులకు చెబుతాను. ఒక వేళ మద్యం తాగే సన్నివేశం ఉంటే జీలకర్ర నీళ్ళు తాగుతాను అన్నారు. 'సేయోన్' సినిమా చాలా బాగా వస్తోంది. వచ్చే యేడాది విడుదల చేస్తాం. ఆ సందర్భంగా అభిమానుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నాను' అని పేర్కొన్నారు.