సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అబుదాబి రేసింగ్‌లో అజిత్‌ను కలిసిన శివ కార్తికేయన్ 

ABN, Publish Date - Feb 08 , 2026 | 12:19 PM

తమిళ స్టార్‌ అజిత్‌కుమార్‌కు (Ajith kumar) కార్‌ రేసింగ్‌ అంటే అమితమైన ఇష్టం. సినిమాల బిజీ లేని సమయంలో ఆయన రేస్‌లతో బిజీగా ఉంటారు.

తమిళ స్టార్‌ అజిత్‌కుమార్‌కు (Ajith kumar) కార్‌ రేసింగ్‌ అంటే అమితమైన ఇష్టం. సినిమాల బిజీ లేని సమయంలో ఆయన రేస్‌లతో బిజీగా ఉంటారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ పోటీల్లో అజిత్‌ టీమ్‌ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అబుదాబిలోని యాస్‌ మెరినా సర్క్యూట్‌లో జరుగుతున్న రేస్‌లో అజిత్‌ టీమ్‌ పాల్గొంది. తమిళ హీరో శివ కార్తికేయన్‌ (Siva karthikeyan) అక్కడ అజిత్‌కుమార్‌ను కలిశారు. ఆయనతో దిగిన ఫొటోలను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

‘స్ఫూర్తిదాయకమైన వ్యక్తితో ఒకరోజు. చేసే పనిపై ఆసక్తి, అంకితభావం అంటే ఏంటో లైవ్‌లో చూశాను’ అని శివ కార్తికేయన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రేసింగ్‌ ప్రాంగణంలో ఇద్దరి ‘కాంబినేషన్‌  అదిరింది’ అంటూ ఇద్దరి హీరోలు ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.

అజిత్‌  రేసింగ్‌పై ఓ ప్రాజెక్టు తెరకెక్కించనున్నట్లు దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ ఇటీవల ప్రకటించారు.   గతేడాది అజిత్‌ ‘విదాముయార్చి’, ‘గుడ్‌  బ్యాడ్‌  అగ్లి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

 

Updated Date - Feb 08 , 2026 | 01:19 PM