రవి వచ్చాక.. నా ప్రపంచమే మారిపోయింది
ABN, Publish Date - Feb 12 , 2026 | 10:08 AM
హీరో రవి మోహన్ నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచమే మారిపోయిందని ప్రముఖ గాయని కెనిషా అభిప్రాయ పడ్డారు.
ప్రముఖ హీరో రవి మోహన్ (Ravi Mohan) నా జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచమే మారిపోయిందని ప్రముఖ గాయని కెనిషా (Kenishaa Francis) అభిప్రాయ పడ్డారు. ఈ నెల 7వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను రవి మోహన్‌తో కలిసి ఘనంగా జరుపుకున్న కెనిషా.. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడి యాలో షేర్ చేశారు.
'బాల్యం నుంచే నన్ను ఎవరూ కూడా ఒక మనిషిగా గుర్తించలేదు. ప్రతి ఒక్కరూ దూరం పెట్టారనే భావన నాకు ఉండేది. నేనే ఏదో పెద్దగా ఆశిస్తున్నానని అనుకునే వారు. కానీ, వారి నుంచి నేను ఎదురు చూసింది కేవలం రవ్వంత ప్రేమ, గౌరవ మర్యాదలు మాత్రమే. రవి మోహన్ వచ్చిన తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. నా ఆలోచ నలు, వ్యవహారశైలి, ప్రేమ వంటి విషయాల్లో నా ఆలోచనా విధంగా కొత్తగా ఉంది' అని పేర్కొన్నారు.