సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'కరుప్పు'లో శింబు పాట ఉండదన్న దర్శకుడు...

ABN, Publish Date - Apr 18 , 2026 | 02:28 PM

సూర్య తాజా చిత్రం 'కరుప్పు' కోసం శింబు పాడిన పాట ఫైనల్‌ కట్‌లో ఉండదని దర్శకుడు ఆర్.జె. బాలాజీ చెబుతున్నాడు. మొదటి నుండి ఈ పాటను సినిమాలు పెట్టాలని తాము అనుకోలేదని ఆయన అంటున్నారు.

Karuppu Movie

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజా చిత్రం 'కరుప్పు' (Karuppu). ఈ సినిమాను తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో డబ్ చేస్తున్నారు. మే 14న వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ కోసం ఆ మధ్య శింబుతో ఓ పాట పాడించాడు దర్శకుడు ఆర్జే బాలాజీ. ఆ పాటకు మిశ్రమ స్పందన వచ్చింది. దానికంటే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది.


తాజాగా దర్శకుడు ఆర్జే బాలాజీ ఓ ఇంటర్వ్యూలో తమ చిత్రంలో ఈ పాట ఉండదని స్పష్టం చేశాడు. అయితే దానికి ఆయన ఓ వివరణ కూడా ఇచ్చాడు. ఈ పాట ట్రోలింగ్‌కు గురైన కారణంగా తాము దీనిని తీసేస్తున్నామనుకుంటే పొరపాటని, నిజానికి మొదటి నుండి సినిమా ఫైనల్‌ కట్‌లో ఈ పాటను పెట్టొద్దనే అనుకున్నామని తెలిపాడు. అంటే ఈ పాటను కేవలం ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ మాదిరి వాడుకోవాలని మేకర్స్ భావించినట్టుగా ఉంది. నిజానికి చాలా సినిమాలలో ఇలా చిత్రీకరించిన ప్రమోషనల్‌ సాంగ్స్‌ను సైతం మూవీలో పెడుతున్నారు. కొంతమంది అయితే... సినిమా ఎండ్‌ టైటిల్స్ సమయంలో ఇలాంటి పాటలను ప్రదర్శిస్తున్నారు. అయితే సూర్య సినిమాలో శింబు పాడిన ఈ పాట మాత్రం సిల్వర్ స్క్రీన్‌ మీద ఉండదని దర్శకుడు చెప్పడం చిత్రమే! త్రిష నాయికగా నటించిన 'కరుప్పు' సినిమాను డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాశ్‌ బాబు, ఎ.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. దీనికి సాయి అభ్యంకర్‌ సంగీతం అందించాడు.

Updated Date - Apr 18 , 2026 | 02:31 PM