సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shwetha menon: పవర్ గ్రూప్ వ్యక్తులపై శ్వేతా మీనన్ నిర్ణయం మాములుగా లేదుగా

ABN, Publish Date - Jul 22 , 2026 | 12:35 PM

‘హేమా కమిటీ నివేదికలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సంఘంలో  కీలక బాధ్యతలు వహించడానికి నేను ఎప్పటికీ అంగీకరించను.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘పవర్ గ్రూప్’ వ్యక్తులను ‘అమ్మ’ సంఘంలో కీలక పదవులు చేపట్టకుండా అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని  అధ్యక్షురాలు శ్వేతా మీనన్ (Shwetha Menon)స్పష్టం చేశారు. గత సమావేశంలో శ్వేతా మీనన్ అమ్మ’ (AMMA) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఇచ్చిన స్టే మేరకు తిరిగి అధ్యక్షురాలిగా బాధ్యతలను కొనసాగిస్తున్నారు. మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన హేమా కమిటీ (Hema committee) నివేదిక నేపథ్యంలో నెలకొన్న వివాదాలపై ‘ ఆమె మరోసారి ఘాటుగా స్పందించారు. ‘హేమా కమిటీ నివేదికలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సంఘంలో  కీలక బాధ్యతలు వహించడానికి నేను ఎప్పటికీ అంగీకరించను. నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం అలాంటి వారిని అడ్డుకునేందుకు పోరాడతాను. అవసరమైతే ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకోవడానికి వెనుకాడను. (Association of Malayalam Movie Artists)

గత సభలో కొంతమంది సభ్యులు నన్ను అవమానించే ప్రయత్నం చేశారు. 'అమ్మ' నుంచి బయటకు పంపించాలని కూడా చూశారు. అయినప్పటికీ నేను వెనక్కి తగ్గలేదు. ఆర్థిక వ్యవహారాలపై నేను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన వారు, దానికి బదులుగా నా వ్యక్తిత్వంపై దాడులు చేయడం ప్రారంభించారు. నా పోరాటం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. బాధితులకు న్యాయం జరిగేలా చూడడమే నా ఉద్దేశం. నాకు ప్రచారం అవసరం లేదు. ఎవరి మీద వ్యక్తిగత కక్షతోనూ నేను మాట్లాడటం లేదు. బాధితుల తరఫున నిలబడటమే నా బాధ్యతగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

రాజకీయ ఆరోపణల గురించి కూడా  ఆమె స్పందించారు. ‘ఓ జాతీయ రాజకీయ పార్టీ కోసం అభ్యర్థులను వెతకడానికి నాకు కోట్ల రూపాయలు ఇచ్చారన్న ప్రచారం పూర్తిగా నిరాధారం. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఉంటే దాచాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో నన్ను భయపెట్టలేరు. నిజం కోసం నా పోరాటం కొనసాగుతుంది. ‘అమ్మ’ సంఘం మళ్లీ పారదర్శకంగా, గౌరవప్రదంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:48 PM