సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shivanna: శివ రాజ్ కుమార్‌ - అభిషన్‌ ప్రధాన పాత్రల్లో కొత్త చిత్రం

ABN, Publish Date - Jun 06 , 2026 | 10:18 AM

కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌ కుమార్‌, యువ దర్శక హీరో అభిషన్‌ జీవింత్‌ ప్రధాన పాత్రల్లో కొత్త చిత్రం తెరకెక్కనుంది.

Abishan Jeevinth - Shivaraj kumar

కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ (Shivaraj kumar), యువ దర్శక హీరో అభిషన్‌ జీవింత్‌ (Abhishan Jeevinth)ప్రధాన పాత్రల్లో కొత్త చిత్రం తెరకెక్కనుంది. గౌతమ్‌ శివరామన్‌ తొలిసారి దర్శకత్వం వహించనున్నారు. ‘జైలర్‌’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించిన శివరాజ్‌ కుమార్‌ తొలిసారి తమిళంలో హీరోగాను, రెండో హీరోగా అభిషన్‌ జీవింత్‌ నటిస్తున్నారు. ఇందులో శివన్న అభిషన్‌ జీవింత్‌కు తండ్రిగా కనిపిస్తారని తెలిసింది. 

టాలీవుడ్‌ యువ నటి శివాని నాగారం హీరోయిన్‌. డ్రామా కంపెనీ అనే కొత్త పతాకంపై ఏ.బాలమురుగన్‌ నిర్మిస్తున్నారు. ఇతర పాత్రల్లో యోగలక్ష్మి, గానా వినోద్‌, సంగీత మాధవన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. అక్కడ వేసిన ప్రత్యేక హౌస్ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్నారు. 

Updated Date - Jun 06 , 2026 | 04:40 PM